రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్... నేటి బెస్ట్ టెస్టు ప్లేయర్లు వీరే! హర్భజన్ లిస్టులో కోహ్లీకి...

Published : Jul 04, 2023, 12:39 PM IST

టెస్టుల్లో జెట్ స్పీడ్‌తో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 28వ టెస్టు సెంచరీని అందుకోవడానికి మూడున్నరేళ్లు సమయం తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఆటతీరును కరోనాకి ముందు, లాక్‌డౌన్ తర్వాత అని రెండు భాగాలు విడదీయవచ్చేమో..  

PREV
16
రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్... నేటి బెస్ట్ టెస్టు ప్లేయర్లు వీరే! హర్భజన్ లిస్టులో కోహ్లీకి...
Image credit: PTI

లాక్‌డౌన్ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మునుపటి ఫైర్ కనిపించడం లేదు. ఆసియా కప్ 2022 తర్వాత కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి ఆరు నెలల కాలంలో 4 సెంచరీలు చేసినా... టెస్టుల్లో మాత్రం విరాట్ రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు..
 

26
Image credit: PTI

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆఖరి రోజు విరాట్ కోహ్లీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో అవుటై అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.. 

36
Rishabh Pant

తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ప్రస్తుతతరంలో బెస్ట్ టెస్టు ప్లేయర్ల లిస్టులో విరాట్ కోహ్లీకి చోటు కూడా ఇవ్వలేదు. ‘ప్రస్తుత తరంలో ఐదుగురు బెస్ట్ టెస్టు ప్లేయర్లు ఎవరు? స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడినవారిని లెక్కించి చెప్పండి’ అంటూ ఓ నెటిజన్ కోరాడు...

46
Image credit: PTI

దీనికి సమాధానం ఇచ్చిన హర్భజన్ సింగ్, ‘నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్...’ అంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్‌తో పాటు ఆసీస్ టెస్టు బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ని నేటి తరంలో బెస్ట్ టెస్టు ప్లేయర్‌గా ప్రకటించాడు హర్భజన్ సింగ్..
 

56
Steve Smith


టీమిండియా నుంచి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ని,ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని నేటి తరంలో బెస్ట్ టెస్టు ప్లేయర్లుగా చెప్పిన హర్భజన్ సింగ్... విరాట్ కోహ్లీతో పాటు నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును కూడా పట్టించుకోకపోవడం విశేషం..

66

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి తన లిస్టులో చోటు ఇచ్చిన హర్భజన్ సింగ్, గత రెండేళ్ల కాలంలో 13 అంతర్జాతీయ టెస్టు సెంచరీలు చేసిన  ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని కూడా పట్టించుకోకపోవడం విశేషం.. 

Read more Photos on
click me!

Recommended Stories