ఈ ఇద్దరినీ ఎన్నాళ్లు ఓపెనర్లుగా ఆడిస్తారు.. రిషబ్ పంత్- ఇషాన్ కిషన్‌లపై ఆశీష్ నెహ్రా కామెంట్...

First Published Nov 22, 2022, 1:06 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయం టీమిండియాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ ఇద్దరినీ టీ20ల్లో ఓపెనర్లుగా కొనసాగించడమే వేస్ట్ అనే వాదనలు వినిపించాయి. పవర్ ప్లేలో హిట్టింగ్ చేసే ఓపెనర్లు కావాలనే డిమాండ్ వినిపించింది...

Image credit: PTI

న్యూజిలాండ్‌తో  జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో టీ20లో ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు కలిసి 5.1 ఓవర్లలో 36 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నెలకొల్పగలిగారు. బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తున్న పిచ్‌పై 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు రిషబ్ పంత్...

ishan

టీ20 వరల్డ్ కప్ తర్వాత దినేశ్ కార్తీక్, మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్టే. ఇక రిషబ్ పంత్‌కి మిగిలిన పోటీ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లతోనే. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

ishan

అయితే ఇషాన్ కిషన్ నుంచి టీమిండియా ఆశించింది, ఆశిస్తోంది ఇది కాదు. ఐపీఎల్‌లో మాదిరిగానే మొదటి బంతి నుంచే హిట్టింగ్‌కి దిగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ఓపెనర్ కోసం వెతుకుతోంది భారత జట్టు. అయితే ఈ విషయంలో ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు...

Image credit: Getty

‘రిషబ్ పంత్‌ ఓపెనర్‌గా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పవర్ ప్లేలో అతను ఒకే బౌండరీ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఆడిన ఆ ఒక్క షాట్‌లో కూడా టైమింగ్ సరిగా లేదు. న్యూజిలాండ్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తారు. గట్టిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు, కేవలం టైమింగ్‌ సెట్ అయితే చాలు...

Image credit: Getty

ఇషాన్ కిషన్ కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే అతను కాస్త బెటర్ షాట్స్ ఆడాడు. ఐపీఎల్‌తో పోలిస్తే అంతర్జాతీయ క్రికెట్‌ భిన్నంగా ఉంటుంది. రెండింట్లో ప్రెషర్‌లో, మైండ్‌సెట్‌లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ ఎన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ చేస్తారనేది చూడాలి... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...
 

click me!