అసలు రికార్డుల గురించే ఆలోచించలేదు.. నా బ్యాటింగ్ సీక్రెట్ అదే.. జగదీశన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Nov 22, 2022, 12:49 PM IST

విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో దుమ్మురేపుతున్న తమిళనాడు యువ బ్యాటర్  నారాయణ్ జగదీశన్.. సోమవారం పలు రికార్డులను నమోదు చేశాడు. వరుసగా ఐదో సెంచరీ  సాధించిన నారాయణ్.. తాను రికార్డుల గురించే ఆలోచించలేదని  అంటున్నాడు.   

PREV
16
అసలు రికార్డుల గురించే ఆలోచించలేదు.. నా బ్యాటింగ్ సీక్రెట్ అదే.. జగదీశన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దేశవాళీ క్రికెట్ లో జోరు చూపిస్తున్న తమిళనాడు కుర్రాడు నారాయణ్ జగదీశన్ కు  తన కెరీర్ లో  నవంబర్ 21వ తేదీ చాలా స్పెషల్.  నిన్న అరుణాచల్ ప్రదేశ్ తో  చిన్నాస్వామి స్టేడియంలో ముగిసిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అతడు పలు రికార్డులను బద్దలుకొట్టాడు.  

26

141 బంతుల్లో  15 సిక్సర్లు, 25 ఫోర్ల సాయంతో  277 పరుగుుల చేసిన జగదీశన్..   సాయి సుదర్శన్ తో కలిసి ఏకంగా 416 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  ఈ ఇద్దరి  వీరబాదుడుతో లిస్ట్ ఏ క్రికెట్ లో తమిళనాడు  506 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది.  

36
Narayan Jagadeesan

ఈ మ్యాచ్ లో   జగదీశన్  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను అధిగమించడమే గాక లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో తన బ్యాటింగ్ సీక్రెట్ గురించి అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసలు తాను రికార్డుల గురించే పట్టించుకోలేదని అన్నాడు.  

46

జగదీశన్ మాట్లాడుతూ.. ‘నేను రికార్డుల గురించి పట్టించుకోలేదు. నేను క్రీజులోకి వెళ్లాక బయట విషయాలేమీ ఆలోచించను. అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ లోనే కాదు..   ఏ మ్యాచ్ లో అయినా  నేను వాటిని పట్టించుకోను. నా టార్గెట్ అంతా 50 ఓవర్లు  క్రీజులో ఉండటం మీదే దృష్టి.  ఈ మ్యాచ్ లో కూడా నేను అదే అనుకున్నా. 

56

ప్రత్యర్థి ఎవరు..? అనేది నేను అసలు ఆలోచించను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండాలి. అదొక్కటే నా మైండ్ లో ఉంటుంది..నా బ్యాటింగ్ సీక్రెట్ అదే’ అని చెప్పాడు. ఇక ఈ ఐదు  సెంచరీలలో తనకు ఏది బాగా సంతృప్తినిచ్చిందని ప్రశ్నించగా.. హర్యానాతో మ్యాచ్ లో సెంచరీ చేయడం తనకు  ఫేవరేట్ అని  తెలిపాడు.  
 

66

‘హర్యానాతో మ్యాచ్ లో సెంచరీ చేయడం నాకు సవాల్ గా అనిపించింది.  ఆ జట్టుకు పటిష్ట బౌలింగ్ యూనిట్ ఉంది.  40వ ఓవర్లో కూడా బంతిని స్వింగ్ చేసే బౌలర్లు ఆ జట్టుకు ఉన్నారు. అందుకే ఆ సెంచరీ  నాకు పేవరేట్..’ అని  చెప్పాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో జగదీశన్ ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అది తనకు సంబంధం లేని విషయమని, తన కంట్రోల్ లో లేని విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పాడు. తనకు తెలిసింది బ్యాటింగ్ మాత్రమేనని వివరించాడు. 
 

click me!

Recommended Stories