ఐపీఎల్ మినీ వేలంలో అతనే హాట్ కేక్... సామ్ కుర్రాన్ కోసం కోట్లు గుమ్మరించబోతున్న ఫ్రాంఛైజీలు...

First Published Nov 21, 2022, 5:05 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లు కలిపి రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, లూకీ ఫర్గూసన్, కేన్ విలియంసన్, బెన్ స్టోక్స్ వంటి స్టార్లు పాల్గొనబోతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్ మాత్రం సామ్ కుర్రాన్...

sam

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, గాయం కారణంగా 2022 సీజన్‌లో పాల్గొనలేదు. 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన సామ్ కుర్రాన్, 2020-2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు...

ఐపీఎల్ కెరీర్‌లో 32 మ్యాచులు ఆడిన సామ్ కుర్రాన్, 22.46 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 వికెట్లు తీశాడు.. గాయం నుంచి కోలుకున్న తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్నాడు సామ్ కుర్రాన్...

Sam Curran

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 13 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్, 6.56 ఎకానమీతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచాడు సామ్ కుర్రాన్...

Sam Curran

బాల్‌తోనే కాకుండా అవసరమైతే బ్యాటుతోనూ భారీ షాట్లు ఆడుతూ ఫినిషర్‌ రోల్ కూడా పోషించగలడు సామ్ కుర్రాన్. దీంతో కుర్రాన్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

చెన్నై సూపర్ కింగ్స్, తిరిగి సామ్ కుర్రాన్‌ని దక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తోంది. సీఎస్‌కేతో పాటు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు కూడా సామ్ కుర్రాన్‌ని దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. పర్సులో రూ.42.25 కోట్లు పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రూ.32.20 కోట్లు మిగుల్చుకున్న పంజాబ్ కింగ్స్ జట్లు కూడా సామ్ కుర్రాన్‌ కోసం పోటీపడొచ్చు...

ఆర్‌సీబీ పర్సులో కేవలం రూ.8.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పర్సులో రూ.13.2 కోట్లు మాత్రమే మిగిలాయి. గుజరాత్ టైటాన్స్‌ పర్సులో రూ.19.25 కోట్లు మిగిలాయి. మిగిలిన ఫ్రాంచైజీలు దగ్గర రూ.20 కోట్లకు పైనే ఉన్నాయి...

ఒక్క ఆటగాడి కోసం రూ.10-15 కోట్లు చెల్లించేందుకు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు వెనకాడవు. అదే జరిగితే సామ్ కుర్రాన్‌ పంట పండినట్టే. కుర్రాన్‌తో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది...

click me!