రిషబ్ పంత్ మ్యాజిక్ చూపించాడు, కానీ అసలైన హీరో మాత్రం అతనే... ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారీస్...

First Published May 23, 2021, 3:37 PM IST

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ‘గబ్బా’ టెస్టు విజయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. 32 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాని మట్టికరిపిస్తూ సంచలన విజయం అందుకుంది భారత యువ జట్టు. సీనియర్లు లేకుండా సాధించిన ఈ విజయం గురించి మరోసారి గుర్తుచేసుకున్నాడు ఆసీస్ ఓపెనర్ మార్కస్ హారీస్...

‘టీమిండియాలాగే మేం కూడా గబ్బా టెస్టును అంత త్వరగా మరిచిపోలేకపోయాం. ఆఖరి రోజు ఆట చాలా చాలా ప్రత్యేకం. నిజానికి ఆఖరి రోజు టీమిండియా లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తుందా? లేక డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తుందా? అని ఆలోచించాం...
undefined
కానీ భారత జట్టు ఆటతీరు అద్భుతం. వారి పర్ఫామెన్స్ మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది కూడా. శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రిషబ్ పంత్ అయితే తన బ్యాటుతో ఇంద్రజాలం చూపించాడనే చెప్పాలి.
undefined
అయితే నిజమైన హీరో మాత్రం ఛతేశ్వర్ పూజారానే. ఆసీస్ బౌలర్లు వేసే బౌన్సర్లకు అడ్డుగా నిలబడి పూజారా ఆడిన ఇన్నింగ్స్ చూసి మేం షాక్ అయ్యాం. అతను ఎన్నో సవాళ్లను స్వీకరించాడు. గాయాలకు ఎదురు నిలిచి నిలబడ్డాడు.
undefined
ఆ రోజు పూజారా బ్యాటింగ్ చూస్తుంటే, ఓటమిని ఒప్పుకోని ఆస్ట్రేలియా క్రికెటర్‌గా అనిపించాడు. శరీరానికి ఎలాంటి దెబ్బలు తగులుతున్నా భయపడకుండా నిలబడిన పూజారా ఇన్నింగ్స్ కారణంగానే మిగిలినవాళ్లు కసిగా బ్యాటింగ్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు హారీస్.
undefined
టీమిండియాతో సిరీస్ ఓడిపోవడం చాలా నిరాశ కలిగించిందన్నమార్కస్ హారీస్... వాళ్లు అద్భుతంగా పోరాడి, విజయం సాధించారని ప్రశంసించాడు...
undefined
అయితే ఛతేశ్వర్ పూజారా ఓ ఆస్ట్రేలియాన్‌లా బ్యాటింగ్ చేశాడని హారీస్ చేసిన కామెంట్‌కి కౌంటర్ అటాక్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కోచ్ వసీం జాఫర్...
undefined
‘బాగుంది... కానీ ఆస్ట్రేలియన్లు, ఆస్ట్రేలియా క్రికెటర్లలా ఎందుకు ఆడలేదు’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్. ఫన్నీ కామెంట్లు, ట్వీట్లతో మంచి మీమీ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వసీం జాఫర్.
undefined
బ్రిస్బేన్ వేదికగా జరిగిన ‘గబ్బా’ టెస్టులో 211 బంతులు ఆడిన ఛతేశ్వర్ పూజారా, 7 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. శుబ్‌మన్ గిల్‌, రిషబ్ పంత్‌లతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు పూజారా.
undefined
పూజారా శరీరాన్ని టార్గెట్ చేస్తూ ఆసీస్ బౌలర్లు బౌన్సర్లు విసిరారు. ఆ రోజు ఇన్నింగ్స్‌లో పూజారాకి దాదాపు 11 గాయాలు అయ్యాయి. అయినా ఎంతో ఓపికగా బ్యాటింగ్ కొనసాగించి, క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు పూజారా...
undefined
91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, పూజారా అవుటైన తర్వాత రిషబ్ పంత్... లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి అద్భుతం చేశాడు. వాషంగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి 89 పరుగులతో భారత్‌కి చారిత్రక విజయాన్ని అందించాడు.
undefined
click me!