వాళ్ల టీమ్‌లో కూడా హార్ధిక్ పాండ్యా లాంటి ప్లేయర్ ఉన్నాడు, కానీ... సునీల్ గవాస్కర్ కామెంట్స్...

First Published | Oct 30, 2022, 11:37 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. జింబాబ్వే చేతుల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది... ముఖ్యంగా టీమ్ సెలక్షన్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు విశ్లేషకులు...

‘పాకిస్తాన్ టీమ్ బౌలింగ్‌ యూనిట్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ల టీమ్‌లో ఒకటికి ముగ్గురు, నలుగురు బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే అసలు సమస్య బ్యాటింగ్‌లోనే. పాక్‌కి మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు...

Fakhar Zaman

పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ సమస్య అందరికీ క్లియర్‌గా కనబుడుతోంది. ఫకార్ జమాన్‌ వంటి అనుభవం ఉన్న ప్లేయర్‌ని మూడు లేదా నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుండేది. గత వరల్డ్ కప్‌లో అదే చేశారు. ఇప్పుడు కూడా అతను, టీమ్‌తోనే ఉన్నాడు. అయితే తుదిజట్టులో చోటు ఇవ్వడం లేదు...


షాన్ మసూద్ పరుగులు చేస్తున్నాడు కానీ ఎంత మూల్యానికి... టీ20ల్లో 40 బంతులాడి 50 పరుగులు చేస్తే అది గొప్ప ఇన్నింగ్స్ అనిపించుకోదు. టెస్టు ప్లేయర్లు, టీ20లకు పనికి రారు. ఫార్మాట్‌కి తగట్టుగా బ్యాటింగ్ మార్చుకునే ప్లేయర్లు కావాలి...

Mohammad Wasim Jr

ఆస్ట్రేలియా పరిస్థితుల మీద రాణించగలిగే జట్టును అయితే వాళ్లు సెలక్ట్ చేయలేకపోయారు. మహ్మద్ వసీం జూనియర్ బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ కొన్ని మంచి షాట్స్ ఆడాడు. అతనిలో హార్ధిక్ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్ కనిపిస్తున్నాడు...

అయితే వసీం ఇంకా కొత్త కుర్రాడే. అతనికి చాలా అనుభవం కావాలి. ఏ షాట్‌ని ఏ సమయంలో ఆడాలో తెలియాలి... అప్పుడే పాండ్యాలా సక్సెస్ కాగలుగుతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

Latest Videos

click me!