‘హిందువులకు భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం. భగవద్గీత అంటే దేవుడి గొంతు నుంచి వచ్చిన పాట అని. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా అలాంటిదే. అతను టీ20 క్రికెట్‌ని ఎలా ఆడాలో భావి క్రికెటర్లకు, నేటి క్రికెటర్లకు భగవద్గీత లాంటి ఇన్నింగ్స్‌తో తెలియచేశాడు...
virat kohli
ఓ పిల్లి, ఊలు బంతితో ఆడుకుంటున్నట్టుగా, పాకిస్తాన్ బౌలింగ్ అటాక్‌ని చీల్చి చెండాడి పడేశాడు. మెల్‌బోర్న్ గ్రీన్ కార్పెట్‌పై విరాట్ కోహ్లీ తీసుకున్న సమయం, అతని షాట్ సెలక్షన్... అత్యద్భుతం...
క్రికెట్ చరిత్రలో దిగ్గజాలు అని పిలవబడిన వాళ్లు ఎవ్వరూ కూడా విరాట్ కోహ్లీలాంటి ఇన్నింగ్స్‌ని నాకు తెలిసి ఆడలేదు.ఎక్కడా రాజీపడకుండా ప్రత్యర్థిని అత్యంత క్రూరంగా ఛిన్నాభిన్నం చేసేశాడు.ఇది ఆర్ట్ ఆఫ్ బ్యాటింగ్... నేను, నా జీవితకాలంలో చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే..
virat kohli
15 ఏళ్లుగా టీ20 క్రికెట్‌ని చూస్తూ వస్తున్నా. 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో నాకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. టెస్టుల్లో నేను చాలానే సాధించా. నేను టీ20 ఇన్నింగ్స్‌కి చాలా మెచ్యూరిటీ కావాలని గుర్తించా. అది కూడా 90 వేల మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంకెంత మెచ్యూరిటీ కావాలో అర్థం చేసుకోండి...
ఇలాంటి మ్యాచ్‌కి ఆస్ట్రేలియా ఇంతవరకూ ఎప్పుడూ ఆతిథ్యం ఇచ్చింది లేదు. తన పేరు పెట్టిన స్టేడియంలో ఇలాంటి ఇన్నింగ్స్ వచ్చినందుకు షేన్ వార్న్ గర్వపడతాడు. మోడ్రన్ టీ20 యుగంలో చాలామంది హిట్టర్లు ఉన్నారు. వాళ్లు మ్యాచ్‌ని ఆఖరి వరకూ ఉండి ఫినిష్ చేసినవాళ్లూ ఉన్నారు...
Virat Kohli Six
హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. ఆ రెండు సిక్సర్లతో కామ్‌గా ప్రెషర్ మొత్తాన్ని ప్రత్యర్థి టీమ్‌పైకి నెట్టేసి మ్యాచ్‌ని ఎంజాయ్ చేశాడు. కేవలం పరుగులు చేస్తేనే గొప్ప బ్యాట్స్‌మెన్ అని యంగ్ ప్లేయర్లు అనుకుంటూ ఉంటారు..
Ashwin-Virat Kohli
అయితే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే గొప్ప ఇన్నింగ్స్, గొప్ప బ్యాట్స్‌మెన్ ఎలా ఉండాలో అర్థమవుతుంది. పరుగులు చేయడం గొప్ప కాదు, గల్లీ క్రికెటర్లు కూడా రన్స్ కొడతారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో చేశాం, ఎక్కడ చేశాం, ఎప్పుడు చేశామనేది చాలా ముఖ్యం... అది కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది...’ అంటూ ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రికకి రాసిన సంపాదకీయంలో రాసుకొచ్చాడు గ్రెగ్ ఛాపెల్...
గ్రెగ్ ఛాపెల్ వ్యాసంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించాడు. ‘ఓ ప్రొఫెషనల్ ఆటగాడిగా బతకడం ఎలాగో కోహ్లీని చూసి నేర్చుకోవాలి. ఆయన క్రికెటర్లకు ఫెవరెట్ క్రికెటర్. టీ20ల్లో టెస్టు క్రికెట్ డ్రామాను బంధించాడు...’ అంటూ రాసుకొచ్చాడు సత్య నాదెళ్ల...