IND vs SA T20Is: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో దుమ్మురేపినా బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది.
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన తొలి టీ20 లో భారత్ ఓటమితో సిరీస్ ను ప్రారంభించింది. భారీ స్కోరు చేసినా.. బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. అయితే భారత జట్టు ఓటమికి బౌలర్లే కారణమంటున్నాడు టీమిండియా సారథి రిషభ్ పంత్.
27
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ లో మేం అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాం. బోర్డు పై మాకు మంచి స్కోరుంది. కానీ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మా ప్రణాళికలు సరిగా అమలుచేయలేకపోయాం.
37
మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ చాలా స్లోగా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో కూడా అలాగే ఉంటుందనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
47
డేవిడ్ మిల్లర్, వాన్డెర్ డసెన్ అద్భుతంగా ఆడారు. మిల్లర్ ను కట్టడి చేసేందుకు యత్నించాం. కానీ వికెట్ అందుకు అనుకూలించలేదు. బౌలింగ్ లో మేం అనుకున్నట్టుగా రాణించలేకపోయాం..
57
ఏదేమైనా మా ప్రదర్శన పట్ల మేం సంతోషంగానే ఉన్నాం. తదుపరి మ్యాచులలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే దానిని సరిదిద్దుకుంటాం. ఇక రాబోయే మ్యాచులలో కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాం..’ అని తెలిపాడు.
67
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (76), శ్రేయస్ అయ్యర్ (36), హార్ధిక్ పాండ్యా (31) లు రాణించి భారత్ కు భారీ స్కోరు అందించారు.
77
అయితే లక్ష్య ఛేదనలో ఓ పద్ధతి ప్రకారం చెలరేగింది దక్షిణాఫ్రికా. పవర్ ప్లే లో ప్రిటోరియస్ (29) రెచ్చిపోగా.. మిడిల్ ఓవర్స్ లో వికెట్ కోల్పోకుండా ఆడిన డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్), వాన్డెర్ డసెన్ (75 నాటౌట్) లు ఆఖర్లో విధ్వంసం సృష్టించారు. మరో 5 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. దక్షిణాఫ్రికాకు టీ20లలో ఇదే హయ్యస్ట్ ఛేజింగ్. 2007లో ఆ జట్టు.. వెస్టిండీస్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.