ఉమ్రాన్ మాలిక్ లేడు, అర్ష్‌దీప్ లేడు... టీ20 వరల్డ్ కప్ ముందు రాహుల్ ద్రావిడ్ సేఫ్ గేమ్...

Published : Jun 09, 2022, 10:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్పామెన్స్‌తో టీమిండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఉమ్రాన్ మాలిక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ఉమ్రాన్ మాలిక్, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు... అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి చోటు లేకపోవడం, టీమిండియా ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

PREV
18
ఉమ్రాన్ మాలిక్ లేడు, అర్ష్‌దీప్ లేడు... టీ20 వరల్డ్ కప్ ముందు రాహుల్ ద్రావిడ్ సేఫ్ గేమ్...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, ప్రతీ మ్యాచ్‌లోనూ క్రమం తప్పకుండా 150 కి.మీ. ల వేగంతో బంతులు విసురుతూ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు...

28

అలాగే పంజాబ్ కింగ్స్‌ రిటైన్ చేసుకున్న యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, 14 మ్యాచుల్లో 10 వికెట్లు మాత్రమే తీసినా... 7.70 ఎకానమీతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా వేసిన బౌలింగ్‌తో ఇంప్రెస్ అయిన సెలక్టర్లు, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేశారు...

38

అయితే ఈ ఇద్దరికీ మొదటి టీ20 మ్యాచ్‌లో అవకాశం ఇవ్వని సెలక్టర్లు... సీనియర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లకు చోటు ఇచ్చారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సెన్సేషనల్‌ పర్ఫామెన్స్‌తో వెలుగులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్... గాయాల కారణంగా టీమిండియాలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు...

48

ఇంగ్లాండ్ టూర్‌లో ఎంట్రీ ఇవ్వాల్సిన ఆవేశ్ ఖాన్, గాయం కారణంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఆవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌తో భువనేశ్వర్ కుమార్‌‌లకు తుదిజట్టులో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్... ఉమ్రాన్ మాలిక్‌కి కానీ, అర్ష్‌దీప్ సింగ్‌కి కానీ ఛాన్స్ ఇవ్వలేదు...

58

మొదటి టీ20 మ్యాచ్ మాత్రమే కావడంతో ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వడానికి చాలా సమయం ఉండొచ్చని అభిప్రాయపడవచ్చు. అయితే రెండూ మూడు మ్యాచుల తర్వాత ఆవేశ్ ఖాన్‌నీ కానీ, హర్షల్ పటేల్‌ని కానీ పక్కనబెట్టి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలంటే వాళ్లను తప్పించడానికి కారణాలను కూడా చెప్పాల్సి ఉంటుంది...

68

మొదటి మ్యాచ్ ఆరంభానికి ముందు ‘మ్యాచ్ డే’ అంటూ ట్వీట్ చేసిన ఉమ్రాన్ మాలిక్, తుది జట్టులో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తికి లోనై ఉండొచ్చని అంటున్నారు అభిమానులు...

78

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రిపేర్ చేయడానికి ప్రాక్టీస్‌గా భావిస్తున్న సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్... తుదిజట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోవడాన్ని తప్పుబడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...

88

కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, వారి సత్తాని పరీక్షించాల్సిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... విజయాల కోసం సేఫ్ గేమ్‌ ఆడుతుండడాన్ని కూడా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ద్రావిడ్ కంటే మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి... టీమ్ సెలక్షన్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించేవాడని అంటున్నారు.. 

click me!

Recommended Stories