వెస్టిండీస్ తో తొలి టీ20లో భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీమిండియా తరఫున అరుదైన ఘనతను అందుకున్నాడు. తొలి టీ20లో అతడు 12 పరుగులు చేయగానే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
26
ఈ మ్యాచ్ కు ముందు పంత్.. 988 పరుగులతో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉండేవాడు. విండీస్ తో తొలి టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. 12 పరుగులకు చేరుకోగానే ఈ ఏడాది వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
36
2022లో 27 ఇన్నింగ్స్ లలో పంత్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా సెంచరీ చేసిన పంత్.. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా సెంచరీ బాదాడు. ఇక ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా అందించాడు.
46
Image credit: PTI
పంత్ తర్వాత ఈ జాబితాలో భారత్ నుంచి శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. అయ్యర్.. 23 ఇన్నింగ్స్ లలో 866 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు విండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్ లలో మెరిశాడు. తాజాగా వెస్టిండీస్ తో వన్డేలలో కూడా మెరుగ్గా రాణించాడు.
56
పంత్, అయ్యర్ తర్వాత ఈ జాబితాలో టాప్-3లో ఉన్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. సూర్య.. 525 పరుగులు చేశాడు. తర్వాత రవీంద్ర జడేజా (487), విరాట్ కోహ్లీ (476) నిలిచారు.
66
ఇక అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (23 ఇన్నింగ్స్ లలో 1,250 పరుగులు), లిటన్ దాస్ (28 ఇన్నింగ్స్ లలో 1,214), బాబర్ ఆజమ్ (16 ఇన్నింగ్స్ లలో 1,214), జో రూట్ (1,025) పంత్ కంటే ముందువరుసలో ఉన్నారు.