కెప్టెన్‌గా జడేజా, వైస్ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే... 1998 కామన్వెల్త్ గేమ్స్ ఆడిన భారత జట్టు ఇదే...

Published : Jul 29, 2022, 05:49 PM IST

2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా జట్టు, ఆస్ట్రేలియా మహిళా జట్టుతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టడం, అదీ టీ20 ఫార్మాట్‌లో, మహిళల క్రికెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి 1998లో కామన్వెల్త్ గేమ్స్ ఆడన భారత జట్టు ఎలా ఉండేదో మీకు తెలుసా..

PREV
17
కెప్టెన్‌గా జడేజా, వైస్ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే... 1998 కామన్వెల్త్ గేమ్స్ ఆడిన భారత జట్టు ఇదే...

మలేషియాలో 1998లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 16 జట్లు, నాలుగు గ్రూప్స్‌లో పోటీపడ్డాయి. గ్రూప్ ఏలో శ్రీలంక, జింబాబ్వే, జమైకా, మలేషియా ఉండగా గ్రూప్ బీ నుంచి బర్బుడా, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా పాల్గొన్నాయి. గ్రూప్ సీ నుంచి సౌతాఫ్రికా, బర్బొడాస్,నార్త్‌రన్ ఐస్‌లాండ్, బంగ్లాదేశ్ ఆడగా గ్రూప్ డీలో న్యూజిలాండ్,పాకిస్తాన్, కెన్యా, స్కాట్లాండ్ ఉన్నాయి...

27

గ్రూప్ బీలో మూడు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా నేరుగా సెమీస్‌కి అర్హత సాధించగా బార్బుడా రెండో స్థానంలో,ఇండియా మూడో స్థానంలో, కెనడా ఆఖరి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టు 109 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

37

రెండో మ్యాచ్‌‌లో బర్బుడా 164/9 పరుగులకి పరిమితం కాగా భారత జట్టు 30/2 స్కోరు వద్ద ఉన్నప్పుడు వర్షం కురవడంతో మ్యాచ్ రిజల్ట్ తేలకుండానే రద్దయ్యింది. ఆ తర్వాత కెనడాని 45 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు ఘన విజయం అందుకున్నా రన్‌రేట్ కారణంగా టాప్ 2లో ముగించలేకపోయింది...

47

1998లో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న భారత జట్టుకి అజయ్ జడేజా కెప్టెన్‌గా వ్యవహరించగా అనిల్ కుంబ్లే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. నిఖిల్ చోప్రా, రోహన్ గవాస్కర్, హర్భజన్ సింగ్, గగన్ ఖోడా, అమే కురసియా, దేబసిస్ మోహంటీ, ఎమ్మెస్కే ప్రసాద్, రాహుల్ సంఘ్వీ,రాబిన్ సింగ్, సచిన్ టెండూల్కర్

57

సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా, శ్రీలంకపై 1 వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 44 ఓవర్లలో 130 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని ఆఖరి వికెట్‌ కాపాడుకుని గెలిచింది సౌతాఫ్రికా 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టు, ఆఖరి వికెట్‌కి 35 పరుగుల అజేయ భాగస్వామ్యం జోడించి విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది...

67

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్రాడ్ యంగ్ హ్యాటిక్ తీసి 4 ఓవర్లలో 2 మెయిడిన్లతో 4 వికెట్లు తీసి 4 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాజిక్ చేశాడు. ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది ఆసీస్...

77

గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించి షాన్ పోలాక్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది...

click me!

Recommended Stories