రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచారు, ఇప్పుడేమో... ఆరుగురికి టీమిండియాలో చోటు మిస్...

Published : Feb 05, 2023, 04:05 PM ISTUpdated : Feb 05, 2023, 04:08 PM IST

టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన విజయం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 విజయం.  ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత ఊహించని విధంగా అసాధారణ రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది టీమిండియా... 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాని ఓడించి, ఆసీస్‌కి ఊహించని షాక్ ఇచ్చింది...

PREV
110
రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచారు, ఇప్పుడేమో... ఆరుగురికి టీమిండియాలో చోటు మిస్...

ఆడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత మెల్‌బోర్న్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు, సిడ్నీ టెస్టును డ్రా చేసుకుంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో ఆఖరి టెస్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లతో బరిలో దిగి సంచలన విజయం అందుకుంది...

210

బోర్డర్ గవాస్కర్ 2020-21 ట్రోఫీ గెలిచిన టీమ్‌లోని 10 మంది ప్లేయర్లు, ఈసారి స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.  వీరిలో గబ్బా టెస్టులో ఆడిన ఆరుగురు టీమ్‌లో ప్లేస్ కోల్పోగా టెస్టు సిరీస్‌లో ఆడిన మరో నలుగురు... టీమ్‌లో చోటు కోల్పోయారు. 

310
Hanuma Vihari

చేతి వేళ్లు చిట్లినా పట్టు వదలకుండా క్రీజులో పాజుకుపోయి సిడ్నీలో చారిత్రక విజయాన్ని అందించాడు హనుమ విహారి. అయితే స్వదేశంలో హనుమ విహారిని టెస్టు ఆడించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించదు. అందుకే హనుమ విహారి, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక కాలేదు...

410

గబ్బాలో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు శార్దూల్ ఠాకూర్. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, బ్యాటింగ్‌లో 67 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 123 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే స్వదేశంలో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన బీసీసీఐ, శార్దూల్ ఠాకూర్‌ని జట్టు నుంచి తప్పించింది..

510

గబ్బాలో టెస్టు ఆరంగ్రేటం చేసిన వాషింగ్టన్ సుందర్‌, స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో 62 పరుగులు చేసిన సుందర్, బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా రీఎంట్రీతో వాషింగ్టన్ సుందర్, టీమిండియాకి నెట్ బౌలర్‌గా మాత్రమే పరిమితమయ్యాడు...

610

జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు నవ్‌దీప్ సైనీ. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన నవ్‌దీప్ సైనీ, వికెట్లేమీ తీయకపోయినా గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్‌కి వచ్చిన అద్భుతమైన పోరాటం కనబరిచాడు. అయితే సైనీకి స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో చోటు దక్కలేదు...

710
Ajinkya Rahane

విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా ఆడిలైడ్ టెస్టు తర్వాత స్వదేశానికి వచ్చేశాడు. అయితే భారత జట్టును ఆ పరాజయం నుంచి బయట పడేసే బాధ్యతను తీసుకున్న అజింకా రహానే, మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు. అయితే పేలవ ఫామ్‌లో టెస్టుల్లో చోటు కోల్పోయిన అజింకా రహానే, ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు..

810

గబ్బా టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్‌తో, వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియా టూర్‌కి ముందు టీమ్‌లో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, గబ్బా టెస్టు ఇన్నింగ్స్ కారణంగానే మళ్లీ మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ చివరన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. 
 

910

శుబ్‌మన్ గిల్‌ టెస్టు ఎంట్రీ ఇవ్వకముందు టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్. రెండు డబుల్ సెంచరీలు బాదిన మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా టూర్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. రోహిత్ శర్మ రీఎంట్రీతో ఆఖరి టెస్టులో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన మయాంక్, శుబ్‌మన్ గిల్ కారణంగా టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయాడు.

1010

వన్డే సిరీస్‌కి ఎంపికైనా ఆస్ట్రేలియా టూర్‌లో మూడు ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసేశాడు టి నటరాజన్. గబ్బా టెస్టులో తుది జట్టులోకి వచ్చిన నటరాజన్, తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. అయితే గాయాలతో బాధపడుతూ జట్టుకి దూరమయ్యాడు నట్టూ.. వీరితో పాటు తొలి టెస్టులో టీమిండియాలో సభ్యులుగా ఉన్న టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పృథ్వీ షాలకు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో చోటు దక్కలేదు. జస్ప్రిత్ బుమ్రా గాయంతో తొలి రెండు టెస్టుల్లో ఆడడం లేదు. 

click me!

Recommended Stories