ఆ విషయంలో విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న రిషబ్ పంత్... ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా...

Published : Mar 18, 2022, 06:10 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కి పీడకలను మిగిలిస్తే... రిషబ్ పంత్‌కి మాత్రం మోస్ట్ మెమొరబుల్ ఇయర్‌గా నిలిచిపోయింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో తప్పుకోవడంతో రిషబ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు దక్కిన విషయం తెలిసిందే...

PREV
19
ఆ విషయంలో విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న రిషబ్ పంత్... ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా...

ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని రిషబ్ పంత్, ఐపీఎల్ 2021 సీజన్‌లో వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు... 

29

ఐపీఎల్ 2021 సీజన్ గ్రూప్ స్టేజ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని నిలిపిన రిషబ్ పంత్, దూకుడైన కెప్టెన్సీతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను తలపించాడు...

39

రిషబ్ పంత్ కారణంగా శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడి కెప్టెన్సీ కోసం టీమ్ మారాల్సి వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్.  

49

అయితే మరో విషయంలో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నాడట రిషబ్ పంత్. ఐపీఎల్‌లో చేరిన ప్లేయర్లకు మెసేజ్ చేసి, విషెస్ చెప్పడం విరాట్‌కి అలవాటు...

59

గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, వానిందు హసరంగ వంటి ప్లేయర్లు... ఇంతకుముందు విరాట్ కోహ్లీ తమకు పంపిన మెసేజ్‌ల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే...

69

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ కూడా తన టీమ్ మేట్స్‌కి మెసేజ్ పంపి, విషెస్ తెలుపుతున్నాడట. విండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ ఈ విషయాన్ని బయటపెట్టాడు...

79

‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీ గురించి చాలా విన్నాను. ప్లేయర్లు ఎంత సాదరంగా నన్ను ఆహ్వానించారు...

89

కోల్‌కత్తాలో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత రిషబ్ పంత్ నాకు మెసేజ్ పంపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపి, కలిసి ఆడేందుకు ఆతృతగా ఉన్నా అంటూ మెసేజ్ పంపాడు...

99

రికీ పాంటింగ్‌ బ్యాటింగ్ చూస్తూ పెరిగాను. లీడర్‌గా ఆయనేంటో అందరికీ తెలుసు. పాంటింగ్ కోచింగ్‌లో విలువైన పాఠాలు నేర్చుకునే అవకాశం నాకు ఈ విధంగా కలిగినందుకు సంతోషంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు విండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పావెల్...

Read more Photos on
click me!

Recommended Stories