ఈసారి ఇలాంటి టీమ్‌తో టైటిల్ గెలవడం కష్టమే... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

Published : Mar 18, 2022, 05:36 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ మరికొన్ని రోజుల్లో ఆరంభం కానుంది. 74 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ఫార్మాట్ లీగ్‌ టైటిల్ గెలిచే జట్టు గురించి ఎప్పుడే లెక్కలు, అంచనాలు వేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్. ఎప్పుడూ స్లో అండ్ స్టడీగా సీజన్‌ని ప్రారంభించి, ఆఖర్లో మిగిలిన టీమ్‌లకు చుక్కలు చూపించే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈసారి ఏ మాత్రం అంచనాలు లేకపోవడం విశేషం...

PREV
111
ఈసారి ఇలాంటి టీమ్‌తో టైటిల్ గెలవడం కష్టమే... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీ ప్లేయర్‌గా, టాప్ స్కోరింగ్ బ్యాటర్‌గా ఉంటూ వచ్చాడు డేవిడ్ వార్నర్... ఆరెంజ్ ఆర్మీ సక్సెస్‌లో మెజారిటీ పర్సెంట్ క్రెడిట్, వార్నర్‌కే దక్కాలి...

211

ఐపీఎల్ 2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ లేకుండా బరిలో దిగి, ఫైనల్ చేరింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అప్పుడు జట్టులో శిఖర్ ధావన్, యూసఫ్ పఠాన్, రషీద ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు...

311

ఈసారి డేవిడ్ వార్నర్‌తో పాటు మిగిలిన స్టార్లు అందరూ సన్‌రైజర్స్‌ జట్టును వీడారు. వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లపై కూడా పెద్దగా నమ్మకాలు లేవు...

411

అయిడిన్ మార్క్‌రమ్, ప్రియమ్ గార్గ్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెఫర్డ్, నికోలస్ పూరన్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ అబ్బాట్, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్... ఇలా పొంతన లేకుండా ప్లేయర్లను సెలక్ట్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

511

మెగా వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లతో అసంతృప్తి చెందిన టీమ్ కోచ్ సిమాన్ కటిచ్... తన పదవికి రాజీనామా సమర్పించాడు...

611

బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, పేస్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్... ఇలా దిగ్గజాలు సహాయక సిబ్బందిగా జట్టులో ఉన్నా... సింహాల సారథ్యంలో జింకలు యుద్ధాన్ని గెలవగలవా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...

711

కేన్ విలియంసన్ చాలా రోజులుగా గాయాలతో సతమతమవుతున్నాడు. గాయం కారణంగా భారత్‌తో జరిగిన సిరీస్‌కి కూడా కేన్ విలియంసన్ అందుబాటులో లేడు...

811

కేన్ విలియంసన్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం కష్టమే. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన వాషింగ్టన్ సుందర్ కానీ, నికోలస్ పూరన్ కానీ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ‘అబ్బా...’ అనిపించే పర్ఫామెన్స్ ఇచ్చిన సందర్భాలు ఒక్కటీ లేవు...

911

భువనేశ్వర్ కుమార్‌లో మునుపటి స్వింగ్ లేదు, నటరాజన్‌ కూడా అలా మెరిసి, ఇలా మాయమైపోయాడు. అలా బౌలింగ్‌‌లో మునుపటి ఫైర్ ఉంటుందా? అనేది అనుమానమే...

1011

అంతో కొంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు పెట్టుకున్న ప్లేయర్లు రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్‌లే. ఈ ముగ్గురికీ అంతర్జాతీయ అనుభవం లేదు. ఇన్ని కష్టాల మధ్య సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరినా అద్భుతమే అంటున్నారు అభిమానులు...

1111

అభిమానుల్లోనే కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ యూనిట్‌లో కూడా టైటిల్ హోప్స్ ఏ మాత్రం లేవని, పోయిన సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, ఈసారి టాప్ 7లోకి వచ్చినా చాలనే భావన వారిలో ఉందని సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది...
 

click me!

Recommended Stories