అప్పుడే ఆర్‌సీబీలో చేరాలనుకున్నా, కానీ విరాట్ మాత్రం... దినేశ్ కార్తీక్ కామెంట్...

Published : Mar 18, 2022, 03:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడబోతున్నాడు భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.  ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ వంటి జట్ల తరుపున ఆడిన దినేశ్ కార్తీక్, 2015 సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు...

PREV
111
అప్పుడే ఆర్‌సీబీలో చేరాలనుకున్నా, కానీ విరాట్ మాత్రం... దినేశ్ కార్తీక్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అంటూ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. 9 సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించినా టైటిల్ గెలవలేకపోయాడు విరాట్...

211

దినేశ్ కార్తీక్‌ని ఐపీఎల్ వేలంలో రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అలాగే ఫాఫ్ డుప్లిసిస్‌ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది...

311

దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్‌ మధ్య ఆర్‌సీబీ కెప్టెన్సీ పోటీ నడిచింది. అయితే సౌతాఫ్రికా కెప్టెన్‌గా సక్సెస్ అయిన డుప్లిసిస్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ఆర్‌సీబీ...

411

అయితే 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడే తాను ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడట విరాట్ కోహ్లీ. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు దినేశ్ కార్తీక్...

511

‘ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మాటల్లో నోరుజారి.. ఆర్‌సీబీలోకి రావడానికి ఏదైనా అవకాశం ఉందా... అని అడిగాను...

611

దానికి విరాట్... నువ్వు ఆ విషయం నాతో మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రో, ఎందుకంటే నేను ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా..అని చెప్పేశాడు...

711

విరాట్ సమాధానం విని షాకైనా... అతని నిర్ణయానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం అందరికీ ఉంది.. ’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

811

‘ప్లేయర్‌గా ఫాఫ్ డుప్లిసిస్, తన శక్తిమేర రాణించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఓ లీడర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే...

911

సౌతాఫ్రికా కెప్టెన్‌గా డుప్లిసిస్‌కి మంచి రికార్డు ఉంది. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. ఆట గురించి పూర్తి అవగాహన ఉన్నవారిలో డుప్లిసిస్ ఒకడు... 

1011

నాయకత్వం అనేది జట్టులోని ప్రతీ ప్లేయర్‌ను సరిగా వాడుకోవడం తెలిసి ఉండడం. ఈ విషయంలో ఫాఫ్ డుప్లిసిస్ ఓ టెర్రఫిక్ లీడర్...’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

1111

2021లో భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన సమయంలో కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిశాస్త్రీలను ఇంటర్వ్యూ చేశాడు... 

Read more Photos on
click me!

Recommended Stories