మహ్మద్ షమీ స్పెషల్! మిచెల్ స్టార్క్, మలింగ రికార్డులు బ్రేక్... శార్దూల్ ఠాకూర్ కోసం ఇలాంటి బౌలర్‌ని...

First Published | Oct 22, 2023, 7:00 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు మహ్మద్ షమీ. హార్ధిక్ పాండ్యా గాయపడడంతో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కింది...
 

Mohammed Shami

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ, వేసిన మొదటి బంతికే వికెట్ తీశాడు. విల్ యంగ్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ, టీమిండియాని తెగ విసిగించిన రచిన్ రవీంద్ర వికెట్‌ తీసి, బ్రేక్ అందించాడు..

Mohammed Shami

45-50 డెత్ ఓవర్లలో న్యూజిలాండ్‌ కేవలం 28 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. 48వ ఓవర్‌లో మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్‌లను అవుట్ చేసిన మహ్మద్ షమీ, చివరి ఓవర్‌లో డార్ల్ మిచెల్‌ని పెవిలియన్ చేర్చి.. 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు..

Latest Videos


48 ఏళ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 2 సార్లు ఐదేసి వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ షమీ. ఇంతకుముందు 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు మహ్మద్ షమీ.. ఆ మ్యాచ్‌లో మిగిలిన నలుగురు బౌలర్లు కలిపి రెండే వికెట్లు తీయగలిగారు..

Mohammed Shami

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేదని అంటారు క్రికెట్ విశ్లేషకులు. 

Mohammed Shami

ఇప్పటిదాకా వరల్డ్ కప్‌లో 12 మ్యాచులు ఆడిన మహ్మద్ షమీ, 36 వికెట్లు తీశారు. 12 మ్యాచుల తర్వాత ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 31, లసిత్ మలింగ 26 వికెట్లు మాత్రమే తీశారు. అయినా షమీకి రావాల్సినంత గుర్తింపు, దక్కాల్సినంత క్రెడిట్ దక్కడం లేదు..

Shami

వరల్డ్ కప్‌లో 4+ వికెట్లు తీయడం మహ్మద్ షమీకి ఇది ఐదోసారి. జస్ప్రిత్ బుమ్రా, ఆశీష్ నెహ్రా, జగవళ్ శ్రీనాథ్, ఉమేశ్ యాదవ్, యువరాజ్ సింగ్ రెండేసి సార్లు ఈ షీట్ సాధించారు. ఓవరాల్‌గా మిచెల్ స్టార్క్ మాత్రమే 6 సార్లు 4+ వికెట్లు తీసి, షమీ కంటే ముందున్నాడు..

కేవలం శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ యావరేజ్ కారణంగా అతనికి వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా. మూడు మ్యాచులు ఆడిన శార్దూల్ ఠాకూర్, భారీగా పరుగులు ఇస్తూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

శార్దూల్ కోసం మహ్మద్ షమీ లాంటి సీనియర్ సెన్సేషనల్ బౌలర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని అంటూ పోస్టులు చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్..  

click me!