గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య గొడవలే దీనంతటికీ కారణం... ఆ ఇద్దరి మధ్య ఇగో యుద్ధమే జరుగుతోంది...

Published : Jan 18, 2022, 11:48 AM IST

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పుడు పరిస్థితి ఏ మాత్రం సరిగా లేదు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తర్వాత అతనికి, బీసీసీఐకి మధ్య విబేధాలు తలెత్తినట్టు స్పష్టంగా అర్థమవుతోంది...

PREV
110
గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య గొడవలే దీనంతటికీ కారణం... ఆ ఇద్దరి మధ్య ఇగో యుద్ధమే జరుగుతోంది...

సౌతాఫ్రికాతో టూర్‌కి ముందు కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై విరాట్, ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...

210

వన్డే కెప్టెన్సీ కోల్పోయినందుకు ఫీలైన విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్నయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

310

కోహ్లీ నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ కూడా, విరాట్ తీసుకున్న నిర్ణయంతో షాక్‌కి గురయ్యానని చెప్పాడంటే... అతని నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాడో అర్థం అవుతోంది...

410

కేప్ టౌన్ టెస్టులో డీన్ ఎల్గర్ వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ డీఆర్‌ఎస్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ అధికారులు... ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం...

510

ఆల్‌టైం బెస్ట్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ, అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పుకోవడంతో పాక్ మాజీ క్రికెటర్లకు అవకాశం దొరికినట్టైంది...

610

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవలే కారణమంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్...

710

‘క్రికెట్ గురించి తెలిసిన ఎవ్వరికైనా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐతో గొడవలే కారణమని తెలుస్తుంది. ఇది విరాట్ వ్యక్తిగత నిర్ణయమని చెప్పినా, దీని వెనక గంగూలీ ఉన్నాడు...

810

సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీల ఇగోల మధ్య యుద్ధమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నప్పుడే, టెస్టుల నుంచి కూడా తప్పిస్తారని విరాట్ కోహ్లీకి అర్థమై ఉంటుంది..

910

అందుకే బీసీసీఐకి ఆ అవకాశం ఇవ్వకుండా విరాట్ కోహ్లీ ముందుగానే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. 

1010

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ గెలిచినా, కేప్ టౌన్ టెస్టులో గెలిచినా బీసీసీఐ ఇలాంటి సాహసం చేసి ఉండేది కాదు... విరాట్ ఈ నిర్ణయాలు తీసుకునేవాడు కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్... 

Read more Photos on
click me!

Recommended Stories