టీమిండియా టెస్టు కెప్టెన్ రేసులో పూజారా, అశ్విన్... రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్‌తో పాటు...

First Published Jan 18, 2022, 10:29 AM IST

విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టు నాయకత్వాన్ని తీసుకునేది ఎవరు? అనే విషయంలో చాలా పెద్ద చర్చే నడుస్తోంది... తాజాగా టీమిండియా టెస్టు కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా కూడా వచ్చాడు...

34 ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, వన్డే, టీ20 ఫార్మాట్‌లో జట్టును నడిపించబోతున్నాడు. అయితే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడానికి రోహిత్ సుముఖంగా లేడని సమాచారం...

టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ శర్మకి 50 టెస్టులు ఆడిన అనుభవం కూడా లేదు. అదీకాకుండా ఈ ఏజ్‌లో మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం వయసుకి మించిన భారంగా రోహిత్ భావిస్తున్నాడట...

విరాట్ కోహ్లీ తర్వాత జట్టులో అత్యధిక టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఛతేశ్వర్ పూజారాకి టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో అతనితో బీసీసీఐ చర్చలు సాగిస్తోందని వార్తలు వస్తున్నాయి...

95 టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారా, 18 సెంచరీలతో 6704 పరుగులు చేశాడు. అయితే రెండేళ్లుగా పూజారా సరైన ఫామ్‌లో లేడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు...

ఛతేశ్వర్ పూజారాకే కెప్టెన్సీ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే, అతనికంటే మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేకి ఇస్తే బెటర్‌ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అజింకా రహానేకి జట్టుని నడిపించిన అనుభవం కూడా ఉంది. ఐదు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు...

అయితే సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై, తుది జట్టులో చోటు దొరకడమే కష్టంగా మారిన రహానే, పూజారాలకు కెప్టెన్సీ ఇస్తే తీవ్ర విమర్శలు రావడం ఖాయం...

మరో సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ పూరు కూడా టీమిండియా తర్వాతి కెప్టెన్ రేసులో ఉన్నాడు. 84 టెస్టులు ఆడిన అశ్విన్ 5 సెంచరీలతో పాటు 430 వికెట్లు కూడా పడగొట్టాడు... 

టెస్టులతో పాటు వన్డే, టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి అతన్ని టెస్టు కెప్టెన్‌గా చేయడమే బెటర్ అంటున్నారు విశ్లేషకులు...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలలో టెస్టుల్లో సెంచరీ చేసిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కి టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్...

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించిన రిషబ్ పంత్ దూకుడైన కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి తగ్గకుండా ఉంటుందంటున్నారు...

వీరితో పాటు కెఎల్ రాహుల్ కూడా టీమిండియా టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హజరీతో జోహన్‌బర్గ్ టెస్టులో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌, టెస్టు కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడని టాక్...

click me!