రికీ పాంటింగ్ ఇక్కడ ఆడలేకపోయాడు!అతని కంటే రోహిత్ చాలా బెటర్... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...

Published : Jan 12, 2023, 04:31 PM IST

సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి పరుగుల ప్రవాహం సృష్టించాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్. అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు బాదిన రికీ పాంటింగ్, సారథిగా ఆస్ట్రేలియాకి రెండు వన్డే వరల్డ్ కప్స్ కూడా అందించాడు..

PREV
16
రికీ పాంటింగ్ ఇక్కడ ఆడలేకపోయాడు!అతని కంటే రోహిత్ చాలా బెటర్... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...

అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేలకు పైగా పరుగులు చేసిన రికీ పాంటింగ్, వన్డేల్లో 30 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 29 సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ, రికీ పాంటింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు...

26

రికార్డు స్థాయిలో వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ, తన వన్డే కెరీర్‌లో 236 మ్యాచులు ఆడి 9537 పరుగులు చేశాడు. మరో 436 పరుగులు చేస్తే 10 వేల క్లబ్‌లో చేరతాడు రోహిత్ శర్మ...

36
Rohit Sharma

‘ఆశ్చర్యకర విషయం ఏంటంటే రోహిత్ శర్మ గత నాలుగైదు ఏళ్లలో ఎక్కువ సెంచరీలు చేశాడు. అతను ఎక్కువ మ్యాచులు ఆడింది విదేశాల్లోనే. మరో ఐదు, ఆరు, ఏడేళ్లు ఆడితే ఈజీగా మరో 20 సెంచరీలు కొట్టగలడు...

46

నా ఉద్దేశంలో రికీ పాంటింగ్ కంటే రోహిత్ శర్మ చాలా బెటర్ ప్లేయర్. ఎందుకంటే ఉపఖండంలో రికీ పాంటింగ్‌కి చెత్త రికార్డు ఉంది. అదే రోహిత్‌కి విదేశాల్లో అద్భుతమైన రికార్డు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

56

తన కెరీర్‌లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో కలిపి ఆరు సెంచరీలు బాదాడు రికీ పాంటింగ్. రోహిత్ శర్మ తన కెరీర్‌లో విదేశాల్లో 13 వన్డే సెంచరీలు సాధించాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు..

66

2017 నుంచి రోహిత్ శర్మ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు పదేళ్లలో 10 సెంచరీలు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, 2017-2020 మధ్యలో ఏకంగా 19 వన్డే సెంచరీలు బాదాడు... అయితే 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ, మూడేళ్లుగా ఆ మార్కు అందుకోలేకపోతున్నాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories