ఎంత గొప్ప బ్యాటర్ అయినా అతని వీక్‌నెస్ ఏంటో నాకు బాగా తెలుసు... హర్భజన్ సింగ్ కామెంట్స్...

Published : Mar 18, 2022, 01:26 PM IST

ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్‌గానే కాకుండా గ్రేట్ బ్యాట్స్‌మెన్‌గానూ గుర్తింపు దక్కించుకున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. అయితే రికీ పాంటింగ్‌, తన కెరీర్ ఆసాంతం భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడ్డాడు...

PREV
19
ఎంత గొప్ప బ్యాటర్ అయినా అతని వీక్‌నెస్ ఏంటో నాకు బాగా తెలుసు... హర్భజన్ సింగ్ కామెంట్స్...

103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 18 టెస్టు మ్యాచులాడి 95 వికెట్లు పడగొట్టాడు... భజ్జీకి ఇదే అత్యుత్తమం...

29

టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేసింది కూడా ఆస్ట్రేలియా జట్టుపైనే. 2001లో కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో భజ్జీ ఈ ఫీట్ సాధించాడు...

39

వరుస బంతుల్లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను పెవిలియన్ చేర్చిన హర్బజన్ సింగ్... భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు...

49

అదే సిరీస్‌లో రికీ పాంటింగ్‌ను ఐదు సార్లు స్వల్ప స్కోర్లకే అవుట్ చేశాడు హర్భజన్ సింగ్. మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. 

59

మూడు మ్యాచుల్లో 32 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, నాలుగు సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు... 

69

‘రికీ పాంటింగ్ చాలా గొప్ప ప్లేయర్, అద్భుతమైన బ్యాట్స్‌మెన్. మ్యాచ్ ఆడడానికి క్రీజులోకి వచ్చిన ప్రతీసారీ, బౌలర్లను డామినేట్ చేయాలనే ఉద్దేశంతోనే పాంటింగ్‌ బరిలో దిగుతాడు...

79

అయితే రికీ పాంటింగ్ డిఫెన్స్‌ చాలా వీక్. ఈ విషయాన్ని చాలా త్వరగానే గ్రహించాను. దాన్ని నా బలంగా మార్చుకున్నాను... లైన్ అండ్ లెంగ్త్ మిస్ అవ్వకుండా బంతులు వేస్తే, అతనే ఈజీగా వికెట్ ఇచ్చేస్తాడని గ్రహించాను...

89

నేను టెస్టుల్లో రికీ పాంటింగ్‌ను 11-12 సార్లు అవుట్ చేయడం నా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ రికీ పాంటింగ్ టాప్ క్లాస్ ప్లేయర్...

99

టెస్టుల్లో ఆటను డామినేట్ చేసిన టాప్ 5 బ్యాటర్లను ఎంచుకోవాల్సి వస్తే... రికీ పాంటింగ్‌కి కూడా ఆ లిస్టులో తప్పకుండా చోటు ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

click me!

Recommended Stories