బీసీసీఐ ఇచ్చే డబ్బులతోనే పాకిస్తాన్‌లో కుర్రాళ్లకు మ్యాచ్ ఫీజులు చెల్లిస్తున్నాం.. పాక్ మాజీ షోయబ్ అక్తర్

First Published Aug 19, 2023, 11:51 AM IST

ప్రపంచంలోనే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐపీఎల్ ద్వారానే దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటోంది భారత క్రికెట్ బోర్డు. ఐదేళ్ల మీడియా రైట్స్‌ని రూ.48 వేల కోట్ల రూపాయలకు విక్రయించింది బీసీసీఐ. ఫ్రాంఛైజీలు, స్పాన్సర్లు, టికెట్ల విక్రయాలు ఇతరత్రా ఆదాయం కలిపితే భారత క్రికెట్ బోర్డు సంపాదన లక్ష కోట్లకు పైనే ఉంటుంది...

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వేదిక ఇవ్వబోతున్న బీసీసీఐ, ఐసీసీ చెల్లించాల్సిన ఆదాయపు పన్నును కూడా తానే చెల్లిస్తోంది. భారత క్రికెట్ ద్వారా ఐసీసీకి వస్తున్న వందల కోట్ల ఆదాయం, ప్రపంచ దేశాల క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఇండియా ద్వారా ఐసీసీకి చేరే ఆదాయంలో కొంత భాగం పాకిస్తాన్‌కి కూడా చేరుతోంది..
 

Shoaib Akhtar

‘వన్డేలకు క్రేజ్ తగ్గుతోంది. అయితే ఇది ఆఖరి వన్డే వరల్డ్ కప్ కాకూడదని కోరుకుంటున్నా. 50 ఓవర్ల క్రికెట్‌కి ఆదరణ లేకున్నా, వరల్డ్ కప్‌కి చాలా క్రేజ్ ఉంది. ఇండియాలో క్రికెట్‌కి మించిన వ్యాపారం లేనేలేదు. ఇండియాలో వరల్డ్ కప్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు, బీసీసీఐ హుండీలో చేరబోతున్నాయి..

ఈ వరల్డ్ కప్ ద్వారా ఇండియాకి వచ్చే ఆదాయం, పాకిస్తాన్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీమిండియా నుంచి ఐసీసీకి చేరే ఆదాయంతోనే పాకిస్తాన్‌లో చాలామంది కుర్రాళ్లకు మ్యాచ్ ఫీజులు చెల్లిస్తున్నాం. పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వంటి ఎన్నో దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇచ్చే నిధులే జీవనాధారం..
 

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓటమికి సరైన ప్లేయర్లు లేకపోవడం కారణం కాదు. ఎందుకంటే భారత్‌లో ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే కీ మ్యాచుల్లో ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్లకి తెలీదు. మీడియా కూడా వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తూ, ఓడిపోవడానికి కారణమవుతోంది.

మా స్పాన్సర్‌షిప్ పోతుంది, మా డబ్బు పోతుందనే కంగారు ఎప్పుడైతే పెరుగుతుందో, టాలెంట్ ఆటోమేటిక్‌గా చచ్చిపోతుంది. గత ఏడాది ఓ షో కోసం దుబాయ్ వెళ్లాను. అక్కడ ఓ ఇండియన్ లోకల్ ఛానెల్‌ ఇంటర్వ్యూ కోసం పిలిస్తే వెళ్లాను.. అందులో ప్రతీదీ బ్లూ రంగుతో నిండిపోయింది..
 

ప్రతీ స్టేడియాన్ని బ్లూ రంగుతో నింపేశారు. ఎలాగైనా పాకిస్తాన్‌ని ఓడించాలని సింబలిక్‌గా టీమిండియాపై ప్రెషర్ పెంచారు. పాకిస్తాన్‌పై ఎప్పుడూ అలాంటి అంచనాలు ఉండవు. మేం ఎప్పుడూ అండర్‌డాగ్స్‌గానే బరిలో దిగుతాం. అందుకే ఇండియా కంటే బెటర్ పర్పామెన్స్ ఇస్తున్నాం..
 

ఇండియాతో మ్యాచ్‌లో ఓడిపోయినా, మాకు పెద్ద పోయేదేం లేదు.. అందుకే గెలవడానికి ఏం చేయాలో ఆ ప్లాన్‌తో ముందుకు వెళ్తాం. పాక్‌తో ఓడిపోతే పరువు పోతుందని ఇండియా భావిస్తుంది. ఇదే వారి ఆటను మింగేసి, ఫెయిల్యూర్‌కి కారణం అవుతోంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..  

click me!