ఓ యువ క్రికెటర్ బాగా ఆడుతున్నాడంటే చాలు, అతన్ని విరాట్ కోహ్లీతో పోల్చడం చాలా కామన్. స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియంసన్ వంటి ప్లేయర్లతో టెస్టుల్లో పోటీపడిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్ వంటి పోటీపడ్డారు. టీ20ల్లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు..
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కుళ్లుకుంటూ ఉంటారు. అంతెందుకు పాకిస్తాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. అయితే పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ మాత్రం బాబర్ ముందు కోహ్లీ పనికి రాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు..
26
‘ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీ కొంతమంది ప్లేయర్లకు ఆఖరిది కావచ్చు. ఈసారి టీమిండియాలో చాలామంది ప్లేయర్లు, ఆఖరిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నారు. ఆ టీమ్‌లో కొందరు స్టార్లు, టీమ్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు...
36
Rohit Sharma-Babar Azam
ఓ ప్లేయర్‌కి, టీమ్ కంటే ఎక్కువ క్రేజ్ రావడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలా జరిగినప్పుడు మేనేజ్‌మెంట్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలా చూసుకుంటే అన్ని విభాగాల్లో టీమిండియా కంటే పాకిస్తాన్ టీమ్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది..
46
Babar Azam
రోహిత్ శర్మ ఇంకా ఎంతకాలం ఆడతాడు? రోహిత్ శర్మ కంటే బాబర్ ఆజమ్ చాలా బెటర్ కెప్టెన్. ఎందుకంటే బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా టీమ్‌ని ముందుండి నడిపిస్తాడు. రోహిత్ శర్మ ఎందుకు కెప్టెన్‌గా ఉన్నాడో అని చాలామంది భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు..
56
Virat Kohli-Babar Azam
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్‌లా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. అదీకాకుండా కోహ్లీ ఎప్పుడూ బ్యాటింగ్ పిచ్‌లపైనే బాగా ఆడతాడు? పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే అవుటైపోతాడు. బాబర్ ఆజమ్ కెప్టెన్ అయ్యాక ముందుండి నడిపిస్తూ, ఎంతో గౌరవం సంపాదించుకున్నాడు..
66
ఈసారి పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుకుంది. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఈజీగా గెలిచేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు..’ అంటూ కామెంట్లు చేశాడు అకీబ్ జావెద్..