86 వన్డేలు, 16 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన వీవీఎస్ లక్ష్మణ్... ఎందుకని ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు?

Published : Aug 19, 2023, 11:23 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. టీమ్ సెలక్షన్ విషయంలో జట్లన్నీ కసరత్తులు చేసేస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్, వరల్డ్ కప్ కోసం ప్రాథమిక జట్లను ప్రకటించేశాయి. టీమిండియా విషయానికి వస్తే ఆసియా కప్ 2023 టోర్నీ ఆడే జట్టే, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే అవకాశాలు ఉన్నాయి..

PREV
18
86 వన్డేలు, 16 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన వీవీఎస్ లక్ష్మణ్... ఎందుకని ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు?

శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో నాలుగో స్థానంలో ఏ ప్లేయర్‌ని ఆడించాలనే విషయంలో టీమిండియాకి ఇంకా ఓ స్పష్టమైన క్లారిటీ రాలేదు. అయ్యర్, వరల్డ్ కప్ సమయానికి కోలుకోకపోతే సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, తిలక్ వర్మల్లో ఒకరికి ప్రపంచకప్ ఆడే అవకాశం రావచ్చు..

28

ఏళ్లుగా టీమ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ని, టీ20ల్లో నెం.1గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని కాదని.. వెస్టిండీస్ టూర్‌లో ఆరంగ్రేటం చేసిన తిలక్ వర్మను 2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ఎంపిక చేస్తే.. అది పెద్ద సంచలనమే అవుతుంది.. ఎందుకంటే పట్టుమని 10 మ్యాచుల అనుభవం కూడా వరల్డ్ కప్ ఆడడం అంటే సాధారణ విషయం కాదు..

38

టీమిండియా తరుపున 134 టెస్టులు ఆడి 8781 పరుగులు చేసిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తన 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

48

వీవీఎస్ లక్ష్మణ్, తన కెరీర్‌లో 86 వన్డేలు ఆడి 30.76 సగటుతో 2338 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2012 వరకూ టెస్టుల్లో కొనసాగిన వీవీఎస్ లక్ష్మణ్, 2006లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు..

58

2003 వన్డే వరల్డ్ కప్ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్‌కి టీమ్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే వికెట్ల మధ్య నెమ్మదిగా పరుగెడతాడనే అపవాదు రావడంతో పాటు స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారణంగా వీవీఎస్ లక్ష్మణ్‌ని తప్పించి.. అతని ప్లేస్‌లో దినేశ్ మోంగియాకి వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కింది..

68
Dinesh Mongia

అయితే లక్ష్మణ్ ప్లేస్‌లో 2003 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న దినేశ్ మోంగియా, టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రపంచ కప్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ 673, సౌరవ్ గంగూలీ 465 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలవడంతో టీమిండియా ఫైనల్‌కి చేరుకోగలిగింది.. 

78

2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ దినేశ్ మోంగియా 12 పరుగులే చేసి నిరాశపరిచాడు. వన్డేల్లో 6 సెంచరీలు చేసిన లక్ష్మణ్, అందులో 4 సెంచరీలు ఆస్ట్రేలియాపైనే చేశాడు. అలాంటి వెరీ వెరీ స్పెషల్ బ్యాటర్‌ని వరల్డ్ కప్‌లో ఆడించి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. 

88

బ్రెట్‌ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, బ్రాడ్ హాగ్ వంటి భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా జట్టు కూడా వీవీఎస్ లక్ష్మణ్‌కి ఎక్కడ బౌలింగ్ చేయాలి? ఎలా అతన్ని నియంత్రించాలో తెలియదని ఒప్పుకోవడం విశేషం.. 

click me!

Recommended Stories