అడిగి తెచ్చుకునేది గౌరవం కాదు, ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన... రమీజ్ రాజాకి అశ్విన్ కౌంటర్...

Published : Oct 10, 2022, 06:21 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాపై గెలిచిన విజయాన్ని పాకిస్తాన్ మరిచిపోవడం లేదు. వరుస పరాజయాల తర్వాత దక్కిన ఈ విజయానికి మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తన స్టైల్‌లో స్పందించాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

PREV
16
అడిగి తెచ్చుకునేది గౌరవం కాదు, ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన... రమీజ్ రాజాకి అశ్విన్ కౌంటర్...

‘ఐసీసీ టోర్నీల్లో ఇండియాతో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్తాన్ అండర్ డాగ్‌గానే ఉండేది. ప్రెషర్ తీసుకుని ఇండియాతో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో ఇండియాని ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది...

26

టీమిండియాని ఓడించలేం... అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే గత వరల్డ్ కప్‌లో దాన్ని సాధించాం. టీమిండియాని ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే... ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ..’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

36

‘రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా... ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా. క్రికెట్ గేమ్‌లో గెలుపు ఓటమలు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది...

46

రెండు జట్ల మధ్య మ్యాచ్‌లా కాకుండా రెండు దేశాల మధ్య పోరాటం చూస్తారు చాలా మంది. అయితే ఓ క్రికెటర్‌గా ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే అనే విషయం నాకు బాగా తెలుసు. అందులోనూ టీ20ల్లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం...

56

క్రెడిట్ కానీ, గౌరవం కానీ అడిగి తీసుకుంటే వచ్చేది కాదు. గెలుపు ఓటములతో గౌరవం దక్కదు. ప్రత్యర్థితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం.. అనేదాన్ని బట్టి గౌరవం దక్కుతుంది.

66

ఓ క్రికెటర్‌గా, నా ప్రత్యర్థి జట్టును నేను గౌరవిస్తా, అది పాకిస్తాన్ అయినా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అయినా కావచ్చు... అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్... 

click me!

Recommended Stories