వార్మప్ మ్యాచ్‌లోనూ హర్షల్ పటేల్ ఫ్లాప్ షో... టీ20 వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాని వెంటాడుతున్న...

First Published Oct 10, 2022, 5:49 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు వార్మప్ మ్యాచులు ఆడుతోంది భారత జట్టు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వార్మప్ మ్యాచులకు ముందుగా వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగిపోగా హర్షల్ పటేల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

team india

భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత శర్మ, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరగా దీపక్ హుడా 22, హార్ధిక్ పాండ్యా 29, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 52 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసిన భారత జట్టు, బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో ఉత్కంఠ విజయం సాధించింది...

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఫ్లాప్ అయిన భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియా పిచ్‌లను బాగా వాడుకున్నాడు. 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కుర్ర బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు...

Harshal Patel

అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటే సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ మాత్రం 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించి ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి, ‘పర్పుల్ క్యాప్’ గెలిచాడు హర్షల్ పటేల్...

ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్, 2021 సీజన్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే టీమిండియాకి కీలక బౌలర్‌గా మారాడు... టీ20ల్లో బుమ్రా, భువీలతో పాటు హర్షల్ పటేల్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ వచ్చింది బీసీసీఐ...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ భువీ, బుమ్రాలతో హర్షల్ పటేల్ బంతిని పంచుకోబోతున్నాడని కొన్ని నెలల క్రితమే డిసైడ్ అయ్యింది. అయితే ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన హర్షల్ పటేల్, రీఎంట్రీ తర్వాత ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు..

Image credit: Getty

అసలే జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఇప్పుడు హర్షల్ పటేల్ కూడా రిథమ్ అందుకోవడానికి చాలా సమయం తీసుకుంటుండడం క్రికెట్ ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది...

Harshal Patel

గాయపడిన జస్ప్రిత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలని భావిస్తోంది బీసీసీఐ. అయితే ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీపక్ చాహార్ కూడా గాయంతో బాధపడుతుండడంతో షమీ తప్ప మరో ఆప్షన్ టీమిండియాకి కనిపించడం లేదు...

Harshal Patel

మహ్మద్ సిరాజ్ వన్డేల్లో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తున్నా టీ20ల్లో ఎక్కువ పరుగులు ఇస్తూ రోహిత్ కెప్టెన్సీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ సమయంలో హర్షల్ పటేల్ పేలవ ప్రదర్శనతో హ్యాండ్ ఇస్తే... టీమిండియా పరిస్థితి ఏం కాను... అని భయపడుతున్నారు అభిమానులు..

click me!