Published : Apr 01, 2025, 05:32 PM ISTUpdated : Apr 01, 2025, 05:33 PM IST
Reliance Jio Free IPL Offer: ఐపీఎల్ వేడి రాజుకుంటున్న వేళ ముఖేష్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఉచిత, అన్‌లిమిటెడ్ ఆఫర్ మరింత కాలం పొడిగించారు. ఆ ఆఫర్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio Free IPL Offer Extended Till April 15th
క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. జియో యూజర్లకు ఐపీఎల్ పండగే ఇప్పుడు ! ఎందుకుంటే జియో తన ఫ్రీ ఐపీఎల్ ఆఫర్ వ్యాలిడిటీని పొడిగించింది. జియో తన పాత, కొత్త కస్టమర్ల కోసం తెచ్చిన స్పెషల్ క్రికెట్ ఆఫర్‌ను ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించింది.
ఇదివరకు ఈ ఆఫర్ మార్చి 31తో అయిపోవాల్సింది. ఈ ఆఫర్ కింద జియో కస్టమర్లు 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్ తీసుకుంటే లేదా కనీసం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు.
24
Reliance Jio Free IPL Offer Extended Till April 15th
ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 100 రూపాయల యాడ్-ఆన్ ప్యాక్ తీసుకుని ఆఫర్ బెనిఫిట్ పొందొచ్చు. దీని ద్వారా ఐపీఎల్ సీజన్‌లో కస్టమర్లు క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదించడానికి రిలయన్స్ జియో అవకాశం కల్పిస్తోంది.
34
Reliance Jio Free IPL Offer Extended Till April 15th
ఈ అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌లో కస్టమర్లు టీవీ/మొబైల్‌లో 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందుతున్నారు. అది కూడా 4K క్వాలిటీలో. దీనివల్ల కస్టమర్లు ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ను ఫ్రీగా ఆస్వాదించవచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22, 2025 నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.
44
Reliance Jio Free IPL Offer Extended Till April 15th
దీంతో పాటు ఇళ్లకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌ను కూడా జియో అందిస్తోంది. అల్ట్రా-ఫాస్ట్ ఇంటర్నెట్ ఉచిత ట్రయల్ కనెక్షన్ 50 రోజుల వరకు ఫ్రీగా ఉంటుంది. కస్టమర్లు 4Kలో క్రికెట్ చూసే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించవచ్చు. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌తో 800+ టీవీ ఛానెళ్లు, 11+ ఓటీటీ అప్లికేషన్‌లు, అన్‌లిమిటెడ్ వైఫై కూడా లభిస్తాయి.