ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను ఎన్ని రకాలుగా అవమానించవచ్చో, అన్ని రకాలుగా అవమానించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కెప్టెన్సీ తొలగించి, టీమ్‌లో నుంచి తప్పించి, ఆఖరికి మ్యాచ్ చూడడానికి కూడా రానివ్వకుండా వార్నర్‌ను ఘోరంగా అవమానించింది ఆరెంజ్ ఆర్మీ...
ఆస్ట్రేలియా జట్టుకి ఆడడం కంటే ఎక్కువగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడడాన్ని ఎంజాయ్ చేసేవాడు డేవిడ్ వార్నర్...
213
ఆరెంజ్ ఆర్మీకి సపోర్టుగా డేవిడ్ వార్నర్‌తో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్లు... అయితే 2021 సీజన్‌లో సీన్ మొత్తం మారిపోయింది...
313
టైటిల్ ఫెవరెట్‌గా ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...
413
ఆరంభంలో విజయం అంచుల దాకా వచ్చిన మ్యాచుల్లోనూ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో చేజేతులా ఓడింది సన్‌రైజర్స్... ఈ కారణంగానే టీమ్ సెలక్షన్ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...
513
టీమ్ మేనేజ్‌మెంట్‌పై చేసిన కామెంట్లతో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ తర్వాత ఏకంగా తుదిజట్టులో చోటు కూడా లేకుండా చేసింది సన్‌రైజర్స్...
613
ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉంటూ, ఐపీఎల్ 2016 సీజన్‌లో టైటాల్ అందించిన వార్నర్‌ను ఇలా అవమానించడం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
713
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కేన్ విలియంసన్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మిగిలిన ప్లేయర్లను వేలానికి వదిలేసిన విషయం తెలిసిందే..
813
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ను రూ.6.25కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. గత మూడు సీజన్లలో వార్నర్ తీసుకున్న మొత్తానికి (రూ.12.5 కోట్లు) ఇది సగం...
913
ఐపీఎల్ 2022 సీజన్‌లో అవకాశం దొరికితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని అంటున్నాడు డేవిడ్ వార్నర్...
1013
‘ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయ్ డేవిడ్ భాయ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు...
1113
దానికి డేవిడ్ వార్నర్... ‘కచ్ఛితంగా ప్రయత్నిస్తా...’ అంటూ రిప్లై ఇచ్చాడు. వార్నర్ రిప్లైపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు...
1213
ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ప్లేయర్లపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది... ఆరెంజ్ ఆర్మీ తీరు నచ్చక ఆ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు.
1313
అయితే మెగా వేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్, భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదడంతో పాటు టీ10 బ్లాస్ట్‌లో 37 బంతుల్లో సెంచరీ బాదాడు...