రవీంద్ర జడేజా 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నిర్ణయం తీసుకోవడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెడ్ కోచ్ ద్రావిడ్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు చేశారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, 25 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు...
210
రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా...
310
జడ్డూకి డిక్లేర్ గురించి చెబితే, డబుల్ సెంచరీకి కావాల్సిన 25 పరుగులను ఒకే ఒక్క ఓవర్‌లో కొట్టేసేవాడని, లేదా మరో నాలుగైదు, ఓవర్లు ఆగి ఉంటే జడ్డూ ఖాతాలో ఆ ద్విశతకం చేరి ఉండేదని కామెంట్లు చేశారు నెటిజన్లు..
410
ఇన్నింగ్స్ 130వ ఓవర్‌లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే, డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.
510
ఈ నిర్ణయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పైనే ఎక్కువ విమర్శలు వినిపించాయి. కారణం ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ ఇలాగే డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...
610
2004లో ముల్తాన్ టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 348 బంతుల్లో 21 ఫోర్లతో 194 పరుగులతో క్రీజులో ఉన్నాడు...
710
మరో 6 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అందుకుంటాడని అనుకుంటున్న సమయంలో వచ్చేయమంటూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు రాహుల్ ద్రావిడ్...
810
క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా రాహుల్ ద్రావిడ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ మిస్ అయినందుకు బాగా ఫీల్ అయ్యాడు...
910
జడేజా మాత్రం తాను డబుల్ సెంచరీ కోసం చూడలేదని, తానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సిందిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి సందేశం పంపినట్టు కామెంట్ చేశాడు...
1010
‘ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సిందిగా నేనే చెప్పాను. అప్పటికే శ్రీలంక ప్లేయర్లు బాగా అలిసిపోవడాన్ని గమనించాను. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, త్వరగా వికెట్లు తీయవచ్చని చెప్పాను...’ అంటూ క్లారిటీ ఇచ్చాడు రవీంద్ర జడేజా...