ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా వస్తానన్నాడు, అంతలోనే అనంతలోకాలకు... షేన్ వార్న్ అకాల మృతిపై...

Published : Mar 05, 2022, 06:48 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. షేన్ వార్న్ అకాల మరణం క్రీడా ప్రపంచంలో విషాదం నింపింది. అయితే షేన్ వార్న్ మరణం తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
112
ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా వస్తానన్నాడు, అంతలోనే అనంతలోకాలకు... షేన్ వార్న్ అకాల మృతిపై...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించిన షేన్ వార్న్, కొన్ని రోజుల కిందట ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించాడు. 
 

212

యాషెస్ సిరీస్‌తో పాటు వరుస పరాజయాలతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది ఇంగ్లాండ్ జట్టు...

312

యాషెస్ సిరీస్‌ 2021-22 టోర్నీలో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయిన ఇంగ్లాండ్, 4-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది....

412

ఈ పరాజయం తర్వాత హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అతని స్థానంలో  పాల్ కాలింగ్‌వుడ్‌ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు...

512

సరిగ్గా వారం రోజుల కిందటే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా వచ్చేందుకు ఎదురుచూస్తున్నానంటూ మనసులో మాట బయటపెట్టాడు షేన్ వార్న్...  

612

‘ఇంగ్లాండ్ జట్టు కోచ్‌గా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇంగ్లాండ్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరించడం చాలా గొప్ప విషయం. నేను ఆ బాధ్యతను చక్కగా నిర్వహించగలనని నమ్ముతున్నా...

712

ఇంగ్లాండ్ టీమ్‌లో చాలా మంది మంచి ప్లేయర్లు ఉన్నారు. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి కొన్ని బేసిక్స్ నేర్పించాల్సి ఉంటుంది...

812

ముఖ్యంగా నో బాల్స్ విపరీతంగా వేస్తున్నారు. క్యాచులు డ్రాప్ చేస్తున్నారు... ఇలాంటి చిన్న చిన్న విషయాలను సరిదిద్దాల్సి ఉంటుంది...
 

912

టీమ్‌లో స్టార్ ప్లేయర్లు ఉన్నా, వాళ్లు సరిగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతుంటే... బేసిక్స్‌పైన ఫోకస్ పెట్టడమే సరైన పని...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్... 

1012

అసలే వరుస పరాజయాలతో కుదేలైన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై షేన్ వార్న్ అకాల మరణంతో మరింత తీవ్రంగా విమర్శల వర్షం కురుస్తోంది...

1112

ఇంగ్లాండ్ జట్టును దరిద్రం పట్టి పీడిస్తోందని, ఆ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వెళ్లి బాగుచేయాలని అనుకున్నందుకే షేన్ వార్న్... ప్రాణాలు కోల్పోయాడని అంటున్నారు కొందరు నెటిజన్లు...

1212

ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై తాము కూడా చింతిస్తున్నామని, అయితే ఆయన మృతికి ఇంగ్లాండ్ జట్టుకి లింక్ చేయడం మూఢనమ్మకమంటూ కొట్టి పారేస్తున్నారు... 

click me!

Recommended Stories