SRHvsRCB: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి రెండో ఓటమి... ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం...

First Published Apr 14, 2021, 11:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై, కేకేఆర్ మధ్య లో స్కోరింగ్ ఉత్కంఠ గేమ్‌ను చూసిన అభిమానులకు మరో మ్యాచ్ అలాంటి మజాను అందించింది. ఒకనొక దశలో 96/1తో ఈజీగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. 150 పరుగుల చేధనలో 143 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో ఓడింది..

150 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి శుభారంభం దక్కలేదు. 9 బంతులు ఆడి కేవలం 1 పరుగు చేసిన వృద్ధిమాన్ సాహా, సిరాజ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్‌ను డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్‌లో 53వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జెమ్మీసన్ బౌలింగ్‌లో డాన్ క్రిస్టియన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వార్నర్...
undefined
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో... భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే మనీశ్ పాండే కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
undefined
అదే ఓవర్‌లో అబ్దుల్ సమద్‌ను డకౌట్ చేసిన షాబజ్ అహ్మద్... ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పేశాడు...
undefined
ఆ తర్వాతి ఓవర్‌లో విజయ్ శంకర్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా, జాసన్ హోల్డర్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు...
undefined
19వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్... ఆఖరి ఓవర్‌ రెండో బంతికి బౌండరీ బాదినా... రెండు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో రనౌట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించిన షాబజ్ నదీమ్, షాబాజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో ఆఖరి బంతికి సింగిల్ తీసినా... 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీకి విజయం దక్కింది...
undefined
రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో షాబజ్ అహ్మద్ 2 ఓవర్లలో 7 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
undefined
click me!