IPL 2025 RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో వర్షం విలన్‌గా మారింది. చాలా సేపు వర్షం పడటంలో మ్యాచ్ జరగదేమో అనే సందేహాలు వచ్చాయి. అయితే, ఇరు జట్ల అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఈ మ్యాచ్ 14-14 ఓవర్ల మ్యాచ్ గా జరిగింది.
టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. అయితే, పంజాబ్ కింగ్ అర్ష్‌దీప్ సింగ్ ఆకలితో ఉన్న సింహంలా ఆర్సీబీపై విరుచుకుపడ్డాడు. అలాగే, చాహల్, బ్రార్, జాన్సెన్ రాణించడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లు సమర్పించుకుని 95/9 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో టిమ్ డేవిడ్ 50 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ను ఆడాడు.
ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ టీమ్ కు మంచి ఆరంభం లభించింది. నేహల్ వధేరా 33 పరుగుల అజేయ ఇన్నింగ్ తో 12.1 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులతో విజయాన్ని అందుకుంది.
6 ఏళ్లలో చరిత్ర సృష్టించిన అర్ష్ దీప్ సింగ్
అర్ష్‌దీప్ సింగ్ 2019 సంవత్సరంలో తొలిసారి పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. పంజాబ్ తరపున ఆడుతూ కేవలం 6 సంవత్సరాలలోనే అతను చరిత్ర సృష్టించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఆర్సీబీపై ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసిన తర్వాత అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో అతను ఫిల్ సాల్ట్, కోహ్లీలను పెవిలియన్ కు పంపాడు. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ ఇప్పటివరకు 86 వికెట్లు పడగొట్టాడు. ఈ జట్టు తరఫున పియూష్ చావ్లా 84 వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో సందీప్ శర్మ ఉండగా, అతను 73 వికెట్లు పడగొట్టాడు.