18 Years of IPL: ఇది 18 ఏళ్ల ఐపీఎల్ పండుగ.. క్రికెట్ ను మార్చిపడేశారు భయ్యా

Published : Apr 18, 2025, 11:12 PM ISTUpdated : Apr 18, 2025, 11:13 PM IST

18 Years of IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. 2008లో ప్రారంభమై మెగా క్రికెట్ లీగ్ గా మారింది. టీ20 క్రికెట్, క్రీడా వినోదాన్ని విప్లవాత్మకంగా మార్చింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఈ లీగ్ లో ఐకానిక్ క్షణాలు చాలా ఉన్నాయి.  

PREV
14
18 Years of IPL: ఇది 18 ఏళ్ల ఐపీఎల్ పండుగ.. క్రికెట్ ను మార్చిపడేశారు భయ్యా
18 Years of IPL: Iconic Performances That Shaped the IPL

18 Years of IPL: కేవ‌లం భార‌త్ లోనే కాదు ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ల‌లో ఒక‌టిగా కొన‌సాగుత‌న్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన 18వ పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైన ఈ లీగ్.. ప్రతి సంవ‌త్స‌రం అభిమానులకు ఊహించని మలుపులు, ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, అసాధ్యమైన లక్ష్యాలను అందిస్తూ.. వాటిని సాధ్యం చేసిన ఆటగాళ్లతో స‌రికొత్త‌గా ముందుకు సాగుతోంది. చాలా మంది యంగ్ ప్లేయ‌ర్ల‌ను ప్ర‌పంచ క్రికెట్ కు ప‌రిచ‌యం చేసింది. అలాగే, ఈ 18 ఏళ్ల ప్రయాణంలో క్రికెట్ ప్ర‌పంచాన్ని శాసించిన ఐకానిక్ క్ష‌ణాలు చాలానే ఉన్నాయి. తొలి మ్యాచ్ తోనే సంచలనం రేగింది.

24
The First-Ever IPL Match – McCullum’s Magic Unleashed

ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య జరిగింది. ఇది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ మాత్రమే కాదు.. క్రికెట్ ఫ్రాంచైజీ లీగ్‌లకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తీసుకువచ్చింది. ఒక జట్టు పరుగుల సునామీ రేపగా, మరో టీమ్ 100 పరుగులు కూడా చేయకుండానే ఆలౌట్ అయింది.

బ్రెండన్ మెకల్లమ్‌ 158* పరుగుల మెరుపు ఇన్నింగ్స్ 

2008లో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసం రేపాడు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు సునామీ రేపాడు. కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులు అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.

ఇది ఐపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ ఇన్నింగ్స్. మెకల్లమ్ అద్భుత ఇన్నింగ్స్ తో కేకేఆర్ 222 పరుగుల భారీ స్కోరు చేసింది. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 140 పరుగుల తేడాతో కేేకేఆర్ విజయం సాధించింది. 

34
Hussey Lights Up IPL Day 2 – Another Hundred, Another High

ఐపీఎల్ రెండో రోజు దుమ్మురేపిన మైకేల్ హస్సీ

ఐపీఎల్ తొలి రోజు బ్రెండన్ మెకల్లమ్ సునామీ సెంచరీ కొట్టగా, రెండో రోజు రోజు కూడా మరో బ్యాటర్ అదరగొట్టే ఇన్నింగ్స్ తో సెంచరీ బాదాడు. అతనే మైకేల్ హస్సీ.  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడిన మైకేల్ హస్సీ కింగ్స్ XI పంజాబ్ (KXIP) పై కేవలం 54 బంతుల్లోనే 116* ప‌రుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు.

హస్సీతో పాటు జాకబ్ ఓరమ్, ధోనీ, బద్రినాథ్ లు కూడా దంచికొట్టారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 240/5 పరుగులు చేసింది. ఇది హై-స్కోరింగ్ మ్యాచ్ లకు నాంది పలికింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ టీమ్ 207/4 పరుగులు చేసింది. 

44
First IPL Champions : Final-Ball Thriller – Dhoni vs Warne, A Clash for the Ages

ఐపీఎల్ తొలి సీజన్ విజేతగా రాజస్థాన్ రాయల్స్ 

అత్యంత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ (RR), ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి ఓడించి తొలి ఐపీఎల్ ట్రోఫీని రాజస్థాన్ గెలుచుకుంది. ఈ లీగ్ ను అండర్‌డాగ్స్‌గా ప్రారంభించి ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో 163/5 పరుగులు చేసింది. సురేష్ రైనా 43 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) చివరి బాల్ కు విన్నింగ్ పరుగులు చేసింది.  20 ఓవర్లలో 164/7 పరుగులతో గెలిచింది. రాజస్థాన్ తరఫున యూసుఫ్ పఠాన్ 56 పరుగులు బెస్ట్ ఇన్నింగ్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories