RCB vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఊహించని రేంజ్‌లో రెచ్చిపోయింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో అదిరిపోయే విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్ కు చేరుకుంది.
టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆర్సీబీ బ్యాటర్లు చుక్కలు చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆ తర్వాత కొండంత టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 19.3 ఓవర్లలో కేవలం 162 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మాస్ విక్టరీతో బెంగళూరు టీమ్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేసింది.
25
పవర్‌ప్లేలోనే తలకిందులైన టైటాన్స్ లైనప్
255 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడం గుజరాత్‌కు ఏమాత్రం ఈజీ కాలేదు. పవర్‌ప్లే ముగిసేసరికే ఆ టీమ్ ఆశలు దాదాపు గాల్లో కలిసిపోయాయి. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసి చాలా బ్యాడ్ లక్‌తో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
జాకబ్ డఫ్ఫీ వేసిన బంతిని కట్ చేసే క్రమంలో సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారి స్టంప్స్‌పై పడటంతో అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్‌స్వింగర్‌కు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్ 11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించినా, జోష్ హాజిల్‌వుడ్ వేసిన స్లోయర్ లెగ్ కట్టర్‌కు బౌల్డ్ కావడంతో గుజరాత్ కోలుకోలేని దెబ్బతింది.
35
రాసిఖ్ సలామ్ దార్ డబుల్ వికెట్ మైడెన్ ఓవర్
గుజరాత్ టాప్ త్రీ బ్యాటర్లు అవుటయ్యాక ఆర్సీబీ మ్యాచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. యంగ్ బౌలర్ రాసిఖ్ సలామ్ దార్ వేసిన ఆరో ఓవర్‌లో గుజరాత్ కథ పూర్తిగా ముగిసింది. ఆ ఓవర్ ఫస్ట్ బంతికే నిశాంత్ సింధు (5) రాసిఖ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి జేసన్ హోల్డర్ (0) కూడా షార్ట్ డెలివరీకి పుల్ షాట్ ఆడబోయి హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ డబుల్ వికెట్ మైడెన్ ఓవర్‌తో గుజరాత్ 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (8) కూడా జాకబ్ డఫ్ఫీ షార్ట్ పిచ్ బంతికి థర్డ్ మ్యాన్ లో ఉన్న హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రషీద్ ఖాన్ 9 బంతుల్లో 1 సిక్సర్‌తో 8 పరుగులు చేసి డఫ్ఫీ బౌలింగ్‌లోనే కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా లోయర్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ తెవాటియా మాత్రం ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తెవాటియా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతడు రొమారియో షెపర్డ్, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదుతూ కేవలం 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ (5)తో కలిసి 9వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 68 పరుగులు జోడించాడు.
అయితే ఈ ఇన్నింగ్స్ గుజరాత్ ఓటమి మార్జిన్‌ను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. చివరకు 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన స్లోయర్ బంతిని తెవాటియా భారీ షాట్ ఆడబోయి ఎక్స్‌ట్రా కవర్ లో రజత్ పటిదార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కగిసో రబాడా (9) కూడా కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
55
ఐపీఎల్ 2026 ఫైనల్లోకి ఆర్సీబీ ఎంట్రీ
చివరి ఓవర్లో మహమ్మద్ సిరాజ్ (5) వికెట్‌ను కృనాల్ పాండ్యా పడగొట్టడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది. మిడ్ ఆఫ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన టిమ్ డేవిడ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో సిరాజ్‌ను అవుట్ చేయడంతో బెంగళూరు విక్టరీ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా , రాసిఖ్ సలామ్ దార్ (2/24), భువనేశ్వర్ కుమార్ (2/28) రెండేసి వికెట్లతో గుజరాత్ ను దెబ్బకొట్టారు. కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ భారీ గెలుపుతో బెంగళూరు టీమ్ ఐపీఎల్ 2026 ఫైనల్‌కు దూసుకెళ్లి కప్ కొట్టేందుకు రెడీ అయిపోయింది.