Sai Sudharsan Hit Wicket: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా అవుటై చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సాయి సుదర్శన్ చేతిలో బ్యాట్ జారి గుజరాత్ కొంప ముంచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అయ్యో సుదర్శన్.. షాట్ కొడితే ఫోర్ వెళ్లింది కానీ.. నువ్వు పెవిలియన్‌కి వెళ్లావేంట్రా బాబు
క్రికెట్‌లో బ్యాడ్ లక్ అనేది ఏ రేంజ్‌లో ఉంటుందో ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్ చూపించింది. ధర్మశాల స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సీన్ రిపీట్ అయింది.
గుజరాత్ స్టార్ ఓపెనర్, ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న సాయి సుదర్శన్ అవుటైన తీరు చూసి అభిమానులు అందరూ షాకయ్యారు. అదృష్టం కలిసొస్తే ఓకే కానీ, దురదృష్టం వెంటాడితే చేతిలో ఉన్న బ్యాట్ కూడా శత్రువులా ఎలా మారుతుందో సాయి సుదర్శన్ విషయంలో ప్రూవ్ అయింది.
25
అసలేం జరిగిందంటే?
ఆర్సీబీ ఉంచిన 255 పరుగుల కొండంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. తీవ్రమైన ప్రెజర్‌లో ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్ వేసేందుకు జేకబ్ డఫీ వచ్చాడు. ఆ ఓవర్ 2.3 బంతికి సాయి సుదర్శన్ ఒక సూపర్ కట్ షాట్ ఆడాడు. బంతి మెరుపు వేగంతో బౌండరీ లైన్ దాటేసింది.
కానీ అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. షాట్ కొట్టిన ఫోర్స్‌లో సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ మిస్సై గాల్లోకి లేచింది. ఆ బ్యాట్ కాస్తా కిందపడి, పిచ్ మీద నుంచి బౌన్స్ అవుతూ నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. సుదర్శన్ అప్పటికే రన్ కోసం హాఫ్ పిచ్ దాకా వెళ్లాడు, తీరా వెనక్కి తిరిగి చూసేసరికి వికెట్లు కిందపడి ఉన్నాయి. దాంతో అంపైర్ హిట్ వికెట్‌గా డిక్లేర్ చేశాడు. కేవలం 14 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ అలా ఎండ్ అయింది.
35
ఐపీఎల్ హిస్టరీలోనే వరస్ట్ రికార్డ్.. తొలి ప్లేయర్‌గా సుదర్శన్
ఈ అవుట్‌తో సాయి సుదర్శన్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో రెండుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇంతకుముందు 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో సుదర్శన్ ఇలాగే అవుటయ్యాడు.
మళ్లీ ఇన్నాళ్లకు, అది కూడా 2026 సీజన్‌లో అత్యంత కీలకమైన క్వాలిఫయర్-1 లాంటి బిగ్ మ్యాచ్‌లో అదే తప్పును రిపీట్ చేశాడు. ప్లేఆఫ్స్ ప్రెజర్‌లో ఇలా అవుట్ కావడం గుజరాత్ టైటాన్స్ టీమ్‌ను చావుదెబ్బ కొట్టింది.
ప్లేఆఫ్స్ సెంటిమెంట్.. గుజరాత్ టీమ్‌కే ఎందుకు ఇలా?
క్రికెట్‌లో హిట్ వికెట్ అనేది చాలా రేర్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 19 సార్లు మాత్రమే బ్యాటర్లు ఇలా అవుట్ అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఐపీఎల్ నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఇలా హిట్ వికెట్ అయిన రికార్డు కేవలం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకే చెందింది.
పోయిన సీజన్ (2025) ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ప్లేయర్ కుశాల్ మెండీస్ కూడా ఇలాగే విచిత్రంగా అవుటయ్యాడు. ఇప్పుడు 2026 ప్లేఆఫ్స్‌లో సాయి సుదర్శన్ అదే సీన్ రిపీట్ చేశాడు. గుజరాత్ టీమ్‌కు ఈ ప్లేఆఫ్స్ హిట్ వికెట్ సెంటిమెంట్ ఏంటో మరి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
55
సోషల్ మీడియాలో ట్రోల్స్
సాయి సుదర్శన్ ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ క్వాలిఫయర్-1 లాంటి మ్యాచ్‌లో ఇలాంటి అవుట్ అతడి కెరీర్‌లో ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ విచిత్రమైన అవుట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. "షాట్ అదిరింది బ్రో.. కానీ వికెట్ పడింది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కు ఈ మ్యాచ్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.