RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !

Published : May 26, 2026, 10:08 PM IST

RCB vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సూపర్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. కేవలం 33 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది.

PREV
14
సిక్సర్ల సునామీ అంటే ఇదే.. గుజరాత్‌ను చితక్కొట్టిన రజత్ పాటీదార్

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ బిగ్ ఫైట్‌లో పాటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ (43), దేవదత్ పడిక్కల్ (30) మంచి స్టార్ట్ ఇచ్చారు.

అయితే మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటీదార్ అసలైన సినిమా చూపించాడు. గుజరాత్ బౌలర్లను టార్గెట్ చేస్తూ గ్రౌండ్ నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయంగా 93 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు గట్టి షాక్ ఇచ్చాడు.

24
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. సిక్సర్ల సునామీ

ఆర్సీబీ ఇన్నింగ్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ రజత్ పాటీదార్ వన్‌మ్యాన్ షోతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన ఓ ఓవర్‌లో రెండు నో-బాల్స్‌తో పాటు ఏకంగా 28 పరుగులు పిండుకుని ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు గట్టి మోమెంటం ఇచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే పాటీదార్ తన హాఫ్ సెంచరీ మార్కును దాటేశాడు. రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి టాప్ బౌలర్లను కూడా లెక్కచేయకుండా క్లాస్ అండ్ మాస్ షాట్లతో విరుచుకుపడ్డాడు.

34
కృనాల్ పాండ్యాతో కలిసి రికార్డు పార్ట్‌నర్‌షిప్

మిడిల్ ఓవర్లలో రజత్ పాటీదార్‌కు తోడుగా కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43 పరుగులు) సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి గుజరాత్ బౌలింగ్‌ను దంచికొడుతూ కేవలం 45 బంతుల్లోనే 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆఖరి 6 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 114 పరుగులు రాబట్టడం విశేషం.

చివరి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పాటీదార్ వరుసగా సిక్సర్లు బాదడంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆఖరి బంతికి సింగిల్ రావడంతో సెంచరీ మిస్ అయినప్పటికీ, పాటీదార్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్‌గా నిలిచిపోతుంది.

44
ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరుతో ఆర్సీబీ సరికొత్త రికార్డు

పాటీదార్ విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇదే అత్యధిక టీమ్ స్కోరు కావడం గమనార్హం. అలాగే ధర్మశాల స్టేడియంలో కూడా ఇదే హైయెస్ట్ టోటల్.

ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాటీదార్ డగౌట్‌కు వెళ్తుంటే స్టేడియం మొత్తం లేచి నిలబడి ‘పాటీదార్.. పాటీదార్’ అంటూ చప్పట్లతో హోరెత్తించింది. గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు ఇచ్చిన లైఫ్‌లైన్స్‌ను అద్భుతంగా వాడుకున్న పాటీదార్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని వరుసగా రెండోసారి ఫైనల్ చేర్చేందుకు బలమైన పునాది వేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories