IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !

Published : Jun 01, 2026, 12:11 AM IST

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించింది. ఫైనల్ పోరులో జీటీ ఓటమికి కారణాలు ఏంటి? శుభ్‌మన్ గిల్ టీమ్ చేసిన బ్లండర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
IPL 2026 Final: ఆర్సీబీ దెబ్బకు జీటీ ఖేల్ ఖతం

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌ పై 5 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఈజీగా చేజ్ చేసింది. అయితే, హోమ్ గ్రౌండ్‌లో అంతటి బలమైన గుజరాత్ టైటాన్స్ ఎందుకు ఓడిపోయింది? గిల్ సేన చేసిన ఆ 5 తప్పులు ఏంటో తెలుసా?

26
1. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్

గుజరాత్ టైటాన్స్ ఓటమికి మెయిన్ రీజన్ వారి ఓపెనర్లు చేతులెత్తేయడమే. ఈ సీజన్‌లో చెరో 700 ప్లస్ రన్స్ చేసిన శుభ్‌మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12) పవర్‌ప్లేలోనే పెవిలియన్ చేరారు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌ను సరిగ్గా కనెక్ట్ చేయలేక గిల్ అవుట్ కాగా, భువనేశ్వర్ కుమార్ వేసిన బౌన్సర్‌కు సాయి సుదర్శన్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఈ ఇద్దరు పిల్లర్లు త్వరగా అవుట్ కావడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది.

36
2. జోస్ బట్లర్ బ్యాటింగ్ పొజిషన్‌తో ప్రయోగాలు

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ జోస్ బట్లర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం. ఈ సీజన్‌లో ఇప్పటికే 500కు పైగా రన్స్ చేసిన బట్లర్‌ను కాదని, వన్ డౌన్‌లో నిశాంత్ సింధును పంపారు. బట్లర్‌ను నంబర్ 4 పొజిషన్‌కు డిమోట్ చేయడం అస్సలు వర్కవుట్ అవ్వలేదు.

ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో బట్లర్ (19 రన్స్, 23 బాల్స్) బాగా స్ట్రగుల్ అయ్యాడు. క్రీజులో సెట్ అవ్వడానికి ఎక్కువ బాల్స్ తిన్న బట్లర్, చివరకు క్రీజ్ వదిలి బయటకు వచ్చి భారీ షాట్‌కు ట్రై చేసి జితేష్ శర్మ చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు.

46
3. షార్ట్ బాల్స్ ప్లాన్‌ను రీడ్ చేయడంలో ఫెయిల్యూర్

ఆర్సీబీ బౌలర్లు పిచ్‌పై ఉన్న బౌన్స్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. గుజరాత్ బ్యాటర్లను షార్ట్ అండ్ హార్డ్ లెంగ్త్ బాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. గిల్, సాయి సుదర్శన్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా,హోల్డర్ అందరూ ఆర్సీబీ పేసర్లు వేసిన షార్ట్ పిచ్ బాల్స్‌కే వికెట్లు పారేసుకున్నారు. పిచ్ కండిషన్స్ తెలిసి కూడా గుజరాత్ బ్యాటర్లు షార్ట్ బాల్స్‌ను డిఫెండ్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ ఆఖర్లో పోరాడి 50 రన్స్ చేయకపోతే గుజరాత్ స్కోరు కనీసం 150 కూడా దాటేది కాదు.

56
4. విరాట్ కోహ్లీని ఆపడంలో గుజరాత్ బౌలర్లు అట్టర్ ఫ్లాప్

156 పరుగుల తక్కువ టార్గెట్‌ను డిఫెండ్ చేయాలంటే గుజరాత్ బౌలర్లు మొదట్లోనే వికెట్లు తీయాలి. కానీ, ఆర్సీబీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అసలు ఛాన్స్ ఇవ్వలేదు. రబడ, సిరాజ్ బౌలింగ్‌ను కోహ్లీ ఉతికేసాడు. కేవలం 25 బాల్స్‌లోనే ఐపీఎల్ ఫైనల్ హిస్టరీలోనే తన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదేశాడు. క్రాంప్స్ వచ్చినా లెక్కచేయకుండా 42 బాల్స్‌లో 75 రన్స్ చేసి సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. కోహ్లీని కట్టడి చేసే ప్లాన్స్ గిల్ దగ్గర లేవు. మధ్యలో రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పాటిదార్, కృనాల్‌లను అవుట్ చేసి దెబ్బ కొట్టినా.. అప్పటికే కోహ్లీ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

66
5. హోమ్ గ్రౌండ్ ప్రెజర్, టాస్ ఫ్యాక్టర్

అహ్మదాబాద్ స్టేడియం గుజరాత్‌కు హోమ్ గ్రౌండ్ అయినా, ఫైనల్ మ్యాచ్ కావడంతో విపరీతమైన ప్రెజర్ కనిపించింది. మ్యాచ్‌కు ముందు గిల్ మాట్లాడుతూ తాము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. కానీ, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత ఈజీగా మారింది. దానికి తోడు స్టేడియంలో ఆర్సీబీ లవర్స్ సపోర్ట్ చూసి గిల్ సేన డిఫెన్స్‌లో పడిపోయింది. ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు చేతులెత్తేయడంతో కప్ చేజారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories