ఆర్సీబీ హిస్టరీ.. వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ సొంతం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. గుజరాత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, ఆ తర్వాత ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని ఈజీగా గెలిపించాడు.
26
గుజరాత్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అహ్మదాబాద్ కోటలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు గిల్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత సాయి సుదర్శన్ (12) కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మిడిల్ ఓవర్లలో రసీఖ్ సలామ్ దార్, భువనేశ్వర్ కుమార్ చెలరేగిపోవడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసీఖ్ దార్ 3 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు, హేజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.
36
పవర్‌ప్లేలోనే ఆర్సీబీ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్
156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి కేక పుట్టించాడు. పవర్‌ప్లేలో ఆర్సీబీ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
కాగిసో రబాడ వేసిన ఒకే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వెంకటేష్ అవుటైనప్పటికీ, అప్పటికే ఆర్సీబీ బలమైన స్థితికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (1) కూడా రబాడ బౌలింగ్‌లో త్వరగానే అవుటయ్యాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఆడాడు. గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లోనే విరాట్ కోహ్లీకి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం, అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో రావడం అభిమానులకు పూనకాలు తెప్పించింది.
మధ్యలో రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రజత్ పటిదార్ (15), కృనాల్ పాండ్యా (1)లను అవుట్ చేసి ఆర్సీబీని కాస్త ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ, కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ విజయం ఈజీగానే అందుకుంది. కోహ్లీకి తోడుగా టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
56
సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన రారాజు
మ్యాచ్ చివరకు వచ్చేసరికి కోహ్లీ కండరాల నొప్పులతో ఇబ్బంది పడ్డాడు. అయినా సరే పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఆర్సీబీ విజయానికి చివరి 2 ఓవర్లలో 14 పరుగులు అవసరమవగా.. అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో కోహ్లీ రెచ్చిపోయాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి స్కోర్లు సమం చేసిన కింగ్.. ఆఖరి బంతికి లాంగ్ ఆన్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. దీంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగుల నాక్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు.
66
వరుసగా రెండోసారి ‘ఈ సాలా కప్ నమ్దే’
ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా నిలవడం ద్వారా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. గత ఏడాది ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన బెంగళూరు, ఇప్పుడు 2026లోనూ ట్రోఫీని డిఫెండ్ చేసుకుని వరుసగా రెండోసారి ఐపీఎల్ బాద్‌షాగా నిలిచింది. ఒకప్పుడు ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన ఆర్సీబీ లవర్స్.. ఇప్పుడు వరుసగా రెండు టైటిళ్లు గెలవడంతో ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన ఆర్సీబీ నిజమైన ఛాంపియన్ అనిపించుకుంది.