RCBvsDC: టాస్ గెలిచిన రిషబ్ పంత్... గెలిచిన జట్టు టాప్‌లోకి...

First Published | Apr 27, 2021, 7:09 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్... తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్‌సీబీ...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున డానియల్ సామ్స్ ఎంట్రీ...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓటమి చవిచూసింది.

ఇరుజట్లు నాలుగేసి విజయాలతో సమంగా ఉన్నా, ఆర్‌సీబీ రన్‌రేటు తక్కువగా ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున డానియల్ సామ్స్ నేటి మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేస్తున్నాడు. నవ్‌దీప్ సైనీ స్థానంలో రజత్ పటిదార్‌తో మరో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాడు కోహ్లీ. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, స్టీవ్ స్మిత్, హెట్మయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ, ఆవేశ్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, కేల్ జెమ్మీసన్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, సిరాజ్

Latest Videos

click me!