RCB: ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా?

Published : May 05, 2025, 04:31 PM IST

RCB IPL 2025 Trophy : ఆర్సీబీ ఐపీఎల్ లో కప్పు గెలిస్తే అది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. అభిమానుల సంబరాలు, విరాట్ కోహ్లీ ఉద్వేగభరిత క్షణాలు, చిన్నస్వామి స్టేడియం ఉత్సాహం, మీడియా హడావిడి అన్నీ అద్భుతంగా ఉంటాయి.

PREV
16
RCB: ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ట్రోఫీ గెలుస్తుందా?

2018 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ఐ కప్పు గెలవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని కైవసం చేసుకోని జట్లలో ఆర్సీబీ ముందు వరుసలో ఉంది. ఈ ఐపిఎల్ 2025 సిరీస్‌లోనైనా ఆర్సీబీ ట్రోఫీని కైవసం చేసుకుంటుందా? అలా గెలిస్తే ఏం జరుగుతుంది?

26
ఐపీఎల్ చరిత్రలో ఓ మైలురాయి.. అభిమానుల సంబరాలు

ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలవడం చాలా ముఖ్యమైన ఘట్టం అవుతుంది. ఇది చాలా ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఆర్సీబీ అభిమానులు 2008 నుండి కప్పు కోసం ఎదురు చూస్తున్నారు.

బెంగళూరు నగర వీధుల్లో, ముఖ్యంగా ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చిన్నస్వామి స్టేడియం వంటి ప్రాంతాల్లో భారీ సంబరాలు జరుగుతాయి. ఆర్సీబీ అభిమానుల సంబరాలు చూడడానికే ఆ జట్టు ఒక్కసారైనా కప్పు గెలవాలి. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు #RCBChampion, #EeSalaCupNamde వంటి హ్యాష్‌ట్యాగ్‌లను సృష్టించి సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటారు. 

36
విరాట్ కోహ్లీ ఉద్వేగ క్షణం

పద్దెనిమిది సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టులో ఉన్నారు. ఈ జట్టు, అభిమానులతో ఆయనకు ఒక అనుబంధం ఉంది. ఎక్కడికి వెళ్లినా దీని గురించి ఆయన మాట్లాడుతారు. ఆయన జట్టులో ఉండగానే ఆర్సీబీ కప్పు గెలిస్తే అది ఆయన జీవితంలో ఒక ఉద్వేగభరిత, ప్రత్యేకమైన క్షణం అవుతుంది.

బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్‌లు గెలవదనే ఒక అపవాదు ఉంది. ఈ ఏడాది బెంగళూరులో జరిగిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ రెండుసార్లు గెలిచింది. కప్పు గెలిస్తే బెంగళూరులో భారీ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం, బీసీసీఐ తరపున అభినందన సభలు నిర్వహించవచ్చు.

46
అమ్మకాలు, ఆర్థిక ప్రభావం

ఆర్సీబీ సంబంధిత వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. భవిష్యత్ సీజన్లలో ఆర్‌సిబి జట్టు స్పాన్సర్‌షిప్ విలువ గణనీయంగా పెరుగుతుంది. 

అన్ని ప్రముఖ వార్తా సంస్థలు, క్రికెట్ షోలు, సోషల్ మీడియాలో ఆర్సీబీ ప్రయాణం, విజయగాథల పై చర్చలు జరుపుతాయి. "ఈ సాలా కప్ నమ్దే" అనే కల నెరవేరిన వార్తలు వైరల్ అవుతాయి.

56
అభిమానుల ఉద్వేగ స్పందనలు

15 ఏళ్లుగా జట్టుతో కలిసి ఉన్న ఆర్సీబీ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు, ఆనందంలో మునిగిపోతారు, చాలామంది దీన్ని పండుగలా జరుపుకుంటారు, చాలా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు! ఆర్సీబీ గెలవదని అన్నవారిని అభిమానులు ఎగతాళి చేస్తారు. 

కాగా, ఆర్సీబీ ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. రజత్ పడిదార్ ఈ ఏడాది ఆర్‌సిబి జట్టు కెప్టెన్‌గా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు.  

66
ఆర్సీబీ జట్టులోని కీలక ఆటగాళ్ళు

విరాట్ కోహ్లీ (బ్యాట్స్‌మన్) - ₹21 కోట్లు

రజత్ పాటిదార్ (బ్యాట్స్‌మన్) - ₹11 కోట్లు

యష్ దయాళ్ (బౌలర్) - ₹5 కోట్లు

జోష్ హాజిల్‌వుడ్ (బౌలర్) - ₹12.50 కోట్లు

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్) - ₹11.50 కోట్లు

జితేష్ శర్మ (వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్) - ₹11 కోట్లు

భువనేశ్వర్ కుమార్ (బౌలర్) - ₹10.75 కోట్లు

లియామ్ లివింగ్స్టన్ (ఆల్ రౌండర్)

కుర్నాల్ పాండ్యా (ఆల్ రౌండర్)

టిమ్ డేవిడ్ (బ్యాట్స్ మాన్)

Read more Photos on
click me!

Recommended Stories