IPL 2025 Top 3 super catches: ఐపీఎల్ 2025లో టాప్-3 సూప‌ర్ క్యాచ్‌లు ఇవే

Published : May 03, 2025, 05:27 PM IST

IPL 2025: Top 3 super catches: ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత ఉత్కంఠభ‌రితంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు పూర్తి కాగా, కొన్ని బౌలింగ్‌తో, మరికొన్ని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాయి. అయితే ప్రేక్షకుల గుండెలను గెలిచింది మాత్రం ఫీల్డర్ల అద్భుత క్యాచ్‌లే. ఈ ఏడాది మూడు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానుల మదిలో ఎప్ప‌టికీ నిలిచిపోతాయి. రషీద్ ఖాన్ ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం, కమిందు మెండిస్ డెవాల్డ్ బ్రెవిస్‌ను అద్భుతంగా పెవిలియ‌న్ కు పంప‌డం, దుష్మంత సమీరా అనుకూల్ రాయ్‌ను అవుట్ చేయడం.. ఇవన్నీ ఐపీఎల్ 2025 లో సూప‌ర్ క్యాచ్ లు గా నిలిచాయి. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
IPL 2025 Top 3 super catches: ఐపీఎల్ 2025లో టాప్-3 సూప‌ర్ క్యాచ్‌లు ఇవే

IPL 2025: Top 3 super catches: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు పూర్త‌య్యాయి. చాలా మ్యాచ్ లు థ్రిల్లింగ్ గా సాగాయి. బ్యాట్స్‌మెన్ ప‌రుగులు సునామీ రేప‌గా, బౌలర్లు నిప్పులు వ‌ర్షంతో పాటు స్పిన్ మాయాజాలంతో అద‌ర‌గొట్టారు.

ఇక ఫీల్డింగ్ లో కూడా అనేక అద్భుతాలు క‌నిపించాయి. మ్యాచ్ కొన్ని అద్భుత‌మైన క్యాచ్ లు మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేశాయి. అలాంటి టాప్-3 సూప‌ర్ క్యాచ్ ల వివ‌రాల ఇప్పుడు తెలుసుకుందాం. 

24

1. రషీద్ ఖాన్ (GT vs SRH) – ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయ‌డం 

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్-గుజరాత్ టైటన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో మ్యాచ్ ను మ‌లుపు తిప్పే క్యాచ్ ను అందుకున్నాడు జీటీ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్. ఎస్ఆర్హెచ్ స్టాన్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ షార్ట్ బాల్‌ను లాంగ్ ఆన్ వైపు సిక్స్ కొట్టాలని యత్నించాడు. అయితే బాల్ సరైన ఫోర్స్‌లో వెళ్లలేదు. దీంతో బౌండ‌రీ లైన్ వ‌ద్ ఫీల్డర్ రషీద్ ఖాన్ చిరుతలా పరిగెత్తి, గాల్లోకి ఎగిరి అంద‌రినీ ఆశ్చర్యపరిచే విధంగా క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్‌ను చాలా మంది సీజన్ బెస్ట్‌గా పేర్కొంటున్నారు. 

రషీద్ ఖాన్ క్యాచ్ వీడియో ఇక్కడ చూడండి

34

2. కమిందు మెండిస్ (CSK vs SRH)-బ్రెవిస్‌ను ఔట్ చేసిన క్యాచ్

చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్ కమిందు మెండిస్.. డెవాల్డ్ బ్రెవిస్‌ను అద్బుత‌మైన క్యాచ్ తో ఔట్ చేశాడు. హర్షల్ పాటేల్ బౌలింగ్‌లో బ్రెవిస్ సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ దాటి వెళ్లే బాల్‌ను కమిందు గాల్లోకి ఎగిరి సూప‌ర్ మ్యాన్ లా క్యాచ్ ప‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇది మజికల్ ముమెంట్స్‌లో ఒకటిగా మారింది.

కమిందు మెండిస్ అందుకున్న సూపర్ క్యాచ్ వీడియో ఇక్కడ చూడండి

44

3. దుష్మంత సమీరా (DC vs KKR)-అనుకూల్ రాయ్ ని ఔట్ చేసిన క్యాచ్

ఢిల్లీ క్యాపిట‌ల్స్-కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో దుష్మంత సమీరా అద్భుత‌మైన మ్యాచ్ తో అనుకూల్ రాయ్ ని అవుట్ చేశాడు. అనుకూల్ రాయ్ బాల్‌ను లెగ్ సైడ్‌గా ఫ్లిక్ చేయగా, అది బౌండరీ దాటేలా కనిపించింది. కానీ సమీరా తన ఎడమవైపుగా పులిలా దూకి బాల్‌ను పట్టేశాడు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయి వెంట‌నే అరవడం మొదలెట్టారు. 

సమీరా అద్భుతమైన క్యాచ్ వీడియో ఇక్కడ చూడండి

Read more Photos on
click me!

Recommended Stories