Maxwell Girlfriend: ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్వెల్ ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ విషయాల తెలుసా..?

Published : Sep 27, 2021, 04:33 PM ISTUpdated : Sep 27, 2021, 04:36 PM IST

IPL 2021: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కు ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఈ 32 ఏండ్ల విధ్వంసకర ఆటగాడు ఒక భారత సంతతి యువతితో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఆ వివరాలివిగో..

PREV
110
Maxwell Girlfriend: ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్వెల్ ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ విషయాల తెలుసా..?

తనదైన రోజున బౌలర్లకు  నిద్రలేని రాత్రులు గడిపేలా చేయడంలో ఆర్సీబీ బౌలర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ది ప్రత్యేకమైన శైలి. బంతిని స్టేడియం దాటించడమే లక్ష్యంగా అతడు ఆడే ప్రతి షాట్.. బౌలర్లకు దడ పుట్టిస్తుంది. 

210

మరి మ్యాక్స్వెల్ కూడా ఓ యువతి విసిరిన ప్రేమ యార్కర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ యువతి భారత సంతతి అమ్మాయే కావడం విశేషం. 

310

మెల్బోర్న్ కు చెందిన విని రామన్ తో మ్యాక్సీ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు.  2016లో కలుసుకున్న ఈ జంట.. 2020లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. 

410

దక్షిణ భారతదేశ మూలాలున్న రామన్.. మెల్బోర్న్ లోనే పుట్టి పెరిగింది. ఆమె అక్కడే ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నది.  ఓ కార్యక్రమంలో  రామన్ ను చూసిన మ్యాక్సీ.. ఇక తర్వాత ఆమె చూపుల నుంచి బయటపడలేకపోయాడు. 

510

మ్యాక్సీ ఎక్కడికి వెళ్లినా రామన్ కూడా అతడితో చెట్టాపట్టాలేసుకుని వెళ్తుంది. ఐపీఎల్ తో పాటు ఆసీస్ జట్టు ఆడే మ్యాచ్ లకు కూడా ఆమెను తీసుకుపోతుంటాడు మ్యాక్స్వెల్. 

610

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే విన్నీ.. తాను మ్యాక్స్వెల్ తో దిగిన ఫోటోలను అందులో పంచుకుంటూ ఉంటుంది. 

710

భారతీయ మూలాలున్నప్పటికీ పూర్తిగా మోడ్రన్ గా కనిపించే విన్నీకి స్విమ్మింగ్ తో పాటు ట్రావెలింగ్ అంటే పడి చచ్చేంత ఇష్టమట. అంతేగాక కాబోయే భర్త మ్యాక్స్వెల్ తో కలిసి టూర్లకు వెళ్లడం కూడా తనకు ఇష్టమని చెబుతున్నది ఈ  హాట్ గర్ల్. 

810

వీరిద్దరూ  ప్రేమలో ఉన్నారని తెలిసి చాలా మంది రామన్ కలర్ గురించి కామెంట్ చేశారు. కానీ మ్యాక్సీ గానీ.. రామన్ గానీ వీటిని పట్టించుకోలేదు. 

910

పెళ్లి కూడా భారతీయ సంప్రదాయంలో చేసుకోవాలని  ఈ ఇద్దరూ అనుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయని టాక్. 

1010
Hottest photos of Glenn Maxwell's desi girlfriends Vini Raman

మ్యాక్స్వెల్, రామన్ కంటే ముందు మరో భారతీయ మహిళ ఆసీస్ క్రికెటర్ ను వివాహం చేసుకుంది. ఆసీస్ ఆటగాడు షాన్ టైట్.. భారత్ కు చెందిన మషుమ్ సింగ్ ను  పెళ్లి చేసుకున్నాడు. 

click me!

Recommended Stories