IPL2021: ఐపీఎల్ నుంచి కుల్దీప్ యాదవ్ అవుట్... చైనామెన్ స్పిన్నర్‌‌కి బ్యాడ్‌ టైమ్...

First Published Sep 27, 2021, 4:05 PM IST

ఒకప్పుడు భారత జట్టులో స్టార్ స్పిన్నర్‌గా వెలుగొందిన కుల్దీప్ యాదవ్, బ్యాడ్ టైమ్ కొనసాగుతూనే ఉంది. గత రెండేళ్లుగా భారత జట్టుతో పాటు ప్రయాణం చేస్తున్నా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, శ్రీలంక టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

తాజాగా మోచేతి గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి కుల్దీప్ యాదవ్ తప్పుకున్నాడు. కేకేఆర్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన కుల్దీప్ యాదవ్, ఆ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యలు తేల్చడంతో స్వదేశానికి పయనమయ్యాడు..

ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి స్పిన్నర్ల కారణంగా కేకేఆర్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు కుల్దీప్ యాదవ్... 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్, కేకేఆర్‌లో మెయిన్ స్పిన్నర్‌గా ఉండేవాడు. 2018లో 17 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, 2017లో 12 వికెట్లు తీశాడు...

అయితే గంభీర్, కేకేఆర్ నుంచి తప్పుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. 2019లో కేవలం 9 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...

2020 సీజన్‌లో ఐదు మ్యాచులు మాత్రమే ఆడిన కుల్దీప్ యాదవ్, 12 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. కేకేఆర్‌లో వరుణ్ చక్రవర్తి ఎంట్రీ తర్వాత కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు...

తుదిజట్టులో చోటు దక్కినప్పటికీ కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ చేయించడానికి ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇష్టపడడం లేదు. దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు కుల్దీప్ యాదవ్...

‘టీమిండియాలో చోటు దక్కకపోతే మనతో మాట్లాడడానికి, తర్వాతి మ్యాచ్‌లో అవకాశం వస్తుందని ధైర్యం చెప్పడానికి కొందరు తోడుగా ఉంటారు. అదే ఐపీఎల్‌లో అయితే అలా జరగదు... 

తుదిజట్టులో చోటు దక్కకపోతే, అలా వెయిట్ చేస్తూ కూర్చోవాలంతే... మోర్గాన్‌కి నా బౌలింగ్‌పైన ఏ మాత్రం నమ్మకం లేనట్టుగా కనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్..
 

click me!