ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ బౌలర్.. పంజాబ్ వీరబాదుడుకు 'జోష్' పోయి ఢీలా

Published : May 14, 2022, 04:20 PM IST

Josh Hazlewood Worst Record: రాయల్ ఛాలెంజర్స్ మెయిన్ బౌలర్ జోష్ హెజిల్వుడ్ కు శుక్రవారం పీడకలగా మిగిలిపోయింది. పంజాబ్ బ్యాటర్లు అతడిపై కసితీరా పగ తీర్చుకున్నారు. పంజాబ్  బ్యాటర్ల  ధాటికి హెజిల్వుడ్ ఐపీఎల్ లో చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. 

PREV
18
ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ బౌలర్.. పంజాబ్ వీరబాదుడుకు 'జోష్' పోయి ఢీలా

ఆర్సీబీ బౌలర్ జోష్ హెజిల్వుడ్ కు శుక్రవారం పీడకలగా మిగిలింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న  ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ ప్టోన్ ల ధాటికి అతడు విలవిల్లాడు. ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. 

28

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో  నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హెజిల్వుడ్.. ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు.   నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 

38

ఐపీఎల్ లో ఒక బౌలర్ నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండా 60 కి పైగా పరుగులు సమర్పించుకున్న జాబితాలో హెజిల్వుడ్  అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఈ జాబితాలో దక్షిణాఫ్రికా  పేసర్ లుంగి ఎంగిడీ ఉండేవాడు. 

48

ఎంగిడి.. 2021లో సీఎస్కే తరఫున ఆడుతూ.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 4 ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  ఆ తర్వాత  స్థానంలో దక్షిణాఫ్రికాకే చెందిన యువ  పేసర్ మార్కో జాన్సేన్ (ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు) ఉన్నాడు. 

58

జాన్సేన్.. 2022 ఐపీఎల్ సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ తో ఆడిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 63 పరుగులిచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరినీ హెజిల్వుడ్ వెనక్కి నెట్టాడు.  ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ బౌలర్  నాలుగు ఓవర్లు  వేసి భారీగా పరుగులివ్వడం.. అది కూడా ఒక వికెట్ అయినా తీసుకోకపోవడం ఇదే తొలిసారి.  

68

అదీగాక.. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతూ అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా కూడా  హెజిల్వుడ్ నిలిచాడు.  ఈ జాబితాలో  షేన్ వాట్సన్ (2016లో ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో)  61 పరుగులతో టాప్ లో నిలిచాడు.  2019 సీజన్ లో టిమ్ సౌథీ.. కేకేఆర్ తో మ్యాచ్ లో 61 పరుగులిచ్చాడు.

78

పంజాబ్ తో మ్యాచ్ లో హెజిల్వుడ్ ను  ముందు బెయిర్ స్టో బాదగా తర్వాత లివింగ్  ప్టోన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్ స్టో..  హెజిల్వుడ్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. ఇక 19వ ఓవర్లో లివింగ్ స్టోన్.. 4, 6, 4, 6  కొట్టాడు. 

88

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ప్రధాన బౌలర్లిద్దరూ  (హెజిల్వుడ్, మహ్మద్ సిరాజ్)  6 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.  సిరాజ్ 2 ఓవర్లలో 36 పరుగులిచ్చాడు. ఆ దెబ్బతో డుప్లెసిస్ మళ్లీ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు.  హెజిల్వుడ్ 64 పరుగులిచ్చిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories