శ్రేయాస్ అయ్యర్‌కి అసలైన పరీక్ష... ఆరెంజ్ ఆర్మీకి భారంగా మారిన కేన్ మామకీ అంతే...

Published : May 14, 2022, 03:26 PM IST

టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకోవాలని ఆశపడిన యంగ్ క్రికెటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. అయితే గత సీజన్‌ అతని కెరీర్‌ని అమాంతం మార్చేసింది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి...

PREV
18
శ్రేయాస్ అయ్యర్‌కి అసలైన పరీక్ష... ఆరెంజ్ ఆర్మీకి భారంగా మారిన కేన్ మామకీ అంతే...
KKR vs SRH

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఫ్యాన్స్‌కి పెద్దగా ఆశలు, అంచనాలు లేవు. మొదటి రెండు మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు కూడా అలాగే సాగింది. అయితే మూడో మ్యాచ్‌ నుంచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది కేన్ మామ టీమ్...

28

కెప్టెన్ కేన్ విలియంసన్‌ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా మిడిల్ ఆర్డర్‌లో అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి వరుసగా ఐదు విజయాలు అందించారు...

38

గత సీజన్లలో ఓపెనర్లు రాణిస్తే, విజయం అంచుల దాకా తీసుకెళితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని జారవిడిచేది. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ రాణిస్తుంటే, సరైన ఓపెనింగ్ దక్కడం లేదు...

48

ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియంసన్ తన రేంజ్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. డేవిడ్ వార్నర్‌ని కాదని, కేన్ మామని రిటైన్ చేసుకుని, కెప్టెన్సీ అప్పగిస్తే... అతనే జట్టుకి భారంగా మారాడు...

58

కేకేఆర్ పరిస్థితి కూడా అంతే. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అద్భుతాలు చేస్తుందని అనుకుంటే, ఆఖరి స్థానంలో నిలిచేందుకు ముంబై, చెన్నైలతో పోటీపడుతోంది కేకేఆర్...

68

ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 175 పరుగులు భారీ స్కోరు చేయగా ఆ టార్గెట్‌ని 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆరెంజ్ ఆర్మీ...

78

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో వరుసగా ఐదు విజయాలు అందుకుని, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. కేకేఆర్ మాత్రం మొదటి రెండు మ్యాచుల తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుంది...

88

పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 8వ స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది. నేటి మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటుంది. సన్‌రైజర్స్‌కి మాత్రం చాలా తక్కువ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

click me!

Recommended Stories