IPL2021 MI vs RCB:మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ మెరుపులు... ముంబై ఇండియన్స్ ముందు...

First Published Sep 26, 2021, 9:22 PM IST

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది... ఆర్‌సీబీ తరుపున విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు..

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్‌ను జస్ప్రిత్ బుమ్రా డకౌట్ చేశాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీకి శ్రీకర్ భరత్, విరాట్ కోహ్లీ కలిసి 68 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... టీ20ల్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 47వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...

37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, మెరుపు హాఫ్ సెంచరీ నమోదుచేసి, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆర్‌సీబీలోకి వచ్చి డిఫరెంట్‌ ప్లేయర్‌లా అదరగొడుతున్నాడు... 

మ్యాక్స్‌వెల్ అవుట్ చేసిన తర్వాతి బంతికే డేంజర్ మ్యాన్ ఏబీ డివిల్లియర్స్‌ను పెవిలియన్ చేర్చాడు బుమ్రా... 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఏబీ డివిల్లియర్స్...

ఆ తర్వాత 20వ ఓవర్‌లో షాబజ్ అహ్మద్ 1 పరుగుకే అవుట్ కాగా... 19ఓవర్‌లో 2 వికెట్లు తీసి బుమ్రా 6 పరుగులు మాత్రమే ఇవ్వగా, ట్రెంట్ బౌల్ట్ ఆఖరి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్‌సీబీని కట్టడి చేశాడు..

click me!