రెండో టెస్టుకి ముందు టీమిండియాకి ఎదురుదెబ్బ... టెస్టు సిరీస్ మొత్తానికి జడ్డూ దూరం...

First Published Feb 11, 2021, 11:04 AM IST

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో తొలి టెస్టు ఓడిన టీమిండియాకి, రెండో టెస్టు ముందు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా మూడో టెస్టులో గాయపడిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలుకి గాయమైంది.

వేలుకి రక్తం కారుతున్నా టేప్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించిన రవీంద్ర జడేజా, భారత బ్యాట్స్‌మెన్ హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ పోరాటం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రావాల్సిన అవసరం లేదు. వేలి గాయంతోనే బ్యాటింగ్ చేయడానికి సిద్ధమై, ప్యాడ్స్, గ్లవ్స్ ధరించి కనిపించాడు జడ్డూ.
undefined
రవీంద్ర జడేజా గాయం తగ్గడానికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఈ కారణంగానే ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో బరిలో దిగని జడేజా, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
undefined
సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా వేలికి శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు.రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని, అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టెస్టులో బరిలో దిగుతాడని భావించారంతా.
undefined
అయితే తాజాగా అతని గాయాన్ని పరీక్షించిన వైద్యులు, జడేజా గాయం పూర్తిగా మానడానికి మరింత సమయం పడుతుందని తేల్చిన వైద్యులు, మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు.
undefined
దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టుల్లో జడేజా బరిలో దిగడం లేదు. ఆ తర్వాత జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి రవీంద్ర జడేజా అందుబాటులో ఉండొచ్చు. ఆస్ట్రేలియా టూర్‌లో గాయాలతో సతమతమైన జడేజా, మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. కోలుకుని రెండో టెస్టు మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత మూడో టెస్టులోనే అతనికి మళ్లీ గాయమైంది.
undefined
స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టే రవీంద్ర జడేజా, బ్యాటుతోనూ అద్భుతంగా రాణించగలడు. మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజా భారత జట్టుకి దూరం కావడం, ఇంగ్లాండ్ జట్టుకి కలిసొచ్చే అవకాశం ఉంది. మొదటి టెస్టులో జడేజా లేకపోవడంతో తేలిగ్గా పరుగులు సాధించింది ఇంగ్లాండ్.
undefined
click me!