లాజిక్ లేకుండా రూల్స్ ఎలా మారుస్తారు... టెస్టు ఛాంపియన్‌షిప్‌పై విరాట్ కోహ్లీ అసహనం..

Published : Feb 11, 2021, 09:36 AM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి బ్రేక్ పడింది. ఈ ఎఫెక్ట్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. పాయింట్ల ఆధారంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించే జట్లను నిర్ణయించాలని సూచించింది ఐసీసీ కమిటీ. 

PREV
18
లాజిక్ లేకుండా రూల్స్ ఎలా మారుస్తారు... టెస్టు ఛాంపియన్‌షిప్‌పై విరాట్ కోహ్లీ అసహనం..

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. స్వదేశంల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓడగానే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే, ఆ ప్రభావం జట్లపై తీవ్రంగా పడుతోంది. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

28

‘కరోనా కారణంగా ఆరు నెలలు వృథా అయిపోయాయి. భారత్‌తో పాటు చాలా జట్లు సిరీస్‌లు ఆడలేకపోయాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితి కంట్రోల్‌లో లేనప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్ మార్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ రూల్స్ మారలేదు...

38

మ్యాచులు ఓడిపోవడం, గెలవడం ప్రతీ జట్టుకూ సహజం. కానీ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించడం కష్టమని అన్నారు. ఒక్క మ్యాచ్ తర్వాత వాళ్లు టాప్‌లో ఉన్నారు. ఇందులో లాజిక్ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు...

48

లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. ఇప్పటికైతే మేం టెస్టు ఛాంపియన్‌షిప్ అర్హత సాధించడం గురించి ఆలోచించడం లేదు. మిగిలిన మూడు టెస్టుల్లో మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

58

భారత మాజీ కోచ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ కమిటీ, పీసీటీ (పర్సటేంజ్ ఆఫ్ విన్నింగ్ పాయింట్స్) ఆధారంగా ఫైనల్ బెర్త్‌ను నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఆధారంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ రద్దు కాగానే న్యూజిలాండ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది.

68

ప్రస్తుతం 68.25 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 2-1, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2-2, 1-1 తేడాతో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్నా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

78

జూన్ 14 నుంచి 18 వరకూ ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ ఫైనల్‌కి న్యూజిలాండ్ అర్హత సాధించగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ఫలితం రెండో ఫైనలిస్టుని నిర్ణయించనుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో ఆస్ట్రేలియాకి అవకాశాలు మెరుగయ్యాయి. 

88

విజయాల శాతం కాకుండా ముందుగా నిర్ణయించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్ చేరే జట్లను నిర్ణయించే ఇంగ్లాండ్ టాప్‌లో, రెండో స్థానంలో టీమిండియా ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌‌కి అర్హత సాధించడమే అసాధ్యం అవుతుంది. 

click me!

Recommended Stories