ఐపీఎల్ 2021 మినీ వేలానికి ముందు ఏకంగా 10 మంది ప్లేయర్లను వేలానికి వదిలేస్తున్నట్టు ప్రకటించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బ్యాటింగ్ సలహాదారుగా మాజీ భారత క్రికెటర్, కోచ సంజయ్ బంగర్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది...

‘డియర్ సంజయ్ బంగర్... ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి మీకు సుస్వాగతం... మీరు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా జట్టుకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక ఖాతా...

ఇంతకుముందు భారత జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారించిన సంజయ్ బంగర్, 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ మార్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీని బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత కిందకి దించడంపై తీవ్రమైన ట్రోల్స్ వినిపించాయి..

ధోనీ రనౌట్ కారణంగానే భారత జట్టు ఓడిందనే వాదనలు వినిపించడంతో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అతని స్థానంలో విక్రమ్ రాథోడ్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నారు...

గతంలో ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి హెడ్‌కోచ్‌గా వ్యవహారించాడు సంజయ్ బంగర్. 2014 నుంచి 2016 వరకూ పంజాబ్‌కి ప్రధాన కోచ్‌గా ఉన్న సంజయ్, 2014 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫైనల్ చేరడానికి కారణమయ్యాడు...

భారత జట్టు తరుపున 12 టెస్టులు ఆడిన సంజయ్ బంగర్, 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. గత సీజన్‌లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లను ఐపీఎల్ మినీ వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ.

చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరిగే ఐపీఎల్ 2021 మినీ వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తోంది ఆర్‌సీబీ. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ.35.7 కోట్లు ఉన్నాయి. దాంతో కరెక్టు ప్లేయర్ దొరికితే రూ.10 నుంచి రూ.12 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉంది ఆర్‌సీబీ.

ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ క్యాంప్ నిర్వహించబోతోంది ఆర్‌సీబీ. దీనికి సంజయ్ బంగర్ పర్యవేక్షకుడిగా వ్యవహారిస్తారు. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్, హెడ్ కోచ్‌గా సైమన్ కటిచ్, ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా మైక్ హుస్సేన్ ఎంపికైన సంగతి తెలిసిందే.