మళ్లీ తొందరపడిన రవీంద్ర జడేజా... సీఎస్‌కే తర్వాతి కెప్టెన్ గురించి ట్వీట్ చేసి, ఆ వెంటనే...

First Published Sep 16, 2021, 12:25 PM IST

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి తొందరపాటు చాలా ఎక్కువ. ఇంతకుముందు కూడా ఈ తొందరపాటు కారణంగానే అనేక ఇబ్బందులు పడిన రవీంద్ర జడేజా... మరోసారి అలాంటి పనితోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఏడాది క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది...

ఈ సీజన్‌లో కాకపోయినా, వచ్చే ఏడాది... అది కాకపోయినా, ఆ తర్వాతి సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ... అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవడం ఖాయం...

అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్ ఎవరు? ఈ విషయం గురించి గత సీజన్ నుంచి చర్చ మొదలైంది... సీఎస్‌కే తర్వాతి కెప్టెన్‌గా ముందు వరుసలో ఉన్నాడు రవీంద్ర జడేజా...

అటు బాల్‌తో, ఇటు బ్యాటింగ్‌తో... అన్నింటికీ మించి కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఒంటి చేత్తో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎన్నో విజయాలు అందించాడు జడ్డూ... 

తాజాగా ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? అని సోషల్ మీడియాలో ఓ ప్రశ్నను అభిమానుల ముందు ఉంచింది సీఎస్‌కే ఫ్యాన్ ఆర్మీ....

ఈ ప్రశ్నకు ‘8’ అంటూ కామెంట్ చేసి, వెంటనే దాన్ని డిలీట్ చేశాడు రవీంద్ర జడేజా. జడ్డూ జెర్సీ నెంబర్ 8. అయితే ఈ ట్వీట్‌ను చాలా మంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు...

ధోనీ తర్వాత తనకే కెప్టెన్సీ దక్కాలని జడేజా కోరుకోవడంలో తప్పు లేదు. ఎమ్మెస్ ధోనీ రిటైర్ అయితే సురేష్ రైనా కూడా క్రికెట్ నుంచి తప్పుకుంటాడు కాబట్టి జడ్డూకి పెద్దగా పోటీ కూడా ఉండదు...

జట్టులో ప్రస్తుతం జడేజాకి పోటీ వచ్చే సీనియర్లు కూడా ఎవ్వరూ లేరు. అయితే తనని తాను ప్రమోట్ చేసుకోవడంతో జడేజా, అభిమానుల దృష్టిలో కెప్టెన్సీ కోసం ఆశపడుతున్నట్టుగా ఓపెన్ అయినట్టు అయ్యింది...

ఇప్పటికే ఇలా 2010 ఐపీఎల్ సమయంలో తనకి వచ్చే ధర తక్కువగా భావించి... జట్టు మారేందుకు తొందరపడి, ఏడాది నిషేధానికి గురయ్యాడు రవీంద్ర జడేజా...

ఐపీఎల్ మొదటి రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ ఆడిన జడ్డూ, జట్టు మారేందుకు లావాదేవీలు జరపడంతో అతనిపై ఏడాదిపాటు నిషేధం పడింది...

click me!