మరో పదేళ్లు ఉంటానన్న ట్వీట్ డిలీట్ చేసిన రవీంద్ర జడేజా... అప్పుడు డేవిడ్ వార్నర్‌, ఇప్పుడు జడ్డూ!..

First Published Aug 5, 2022, 12:57 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ కారణంగా రవీంద్ర జడేజాకి, చెన్నై సూపర్ కింగ్స్‌కి బాగా చెడింది. కెప్టెన్‌గా సీజన్‌ని మొదలెట్టిన రవీంద్ర జడేజా, 8 మ్యాచుల తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యాడు... ఇప్పుడు వచ్చే సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడేందుకు జడ్డూ... ఇష్టపడడం లేదనే సిగ్నల్స్ అందుతున్నాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌ ఆరంభానికి నాలుగు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకి అప్పగించింది సీఎస్‌కే మేనేజ్‌మెంట్...

Ravindra Jadeja

ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ని నేనేనంటూ చాలా సార్లు బాహాటంగా ప్రకటించిన రవీంద్ర జడేజా ఎన్నో అంచనాలతో కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటే సీఎస్‌కే కూడా వరుస పరాజయాలతో సతమతమైంది...

Latest Videos


మొదటి 8 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకున్న తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ రవీంద్ర జడేజా నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీంతో ఆ పొజిషన్‌లోకి తిరిగి వచ్చాడు ఎమ్మెస్ ధోనీ...

Ravindra Jadeja

అయితే రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, మేనేజ్‌మెంట్ బలవంతంగా తప్పించిందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ ప్రెస్ మీటింగ్స్‌లో జడ్డూ కెప్టెన్సీ గురించి చులకనగా కామెంట్లు చేయడంతో జడేజా మరింత ఫీల్ అయ్యాడని వార్తలు వచ్చాయి...

Ravindra Jadeja

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు రవీంద్ర జడేజా. ఇదే సమయంలో సీఎస్‌కే, రవీంద్ర జడేజాని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది... 

కొన్నిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి సంబంధించిన ఫోటోలు, పోస్టులన్నీ డిలీట్ చేసిన రవీంద్ర జడేజా, తాజాగా గత ఏడాది సీఎస్‌కే చేసిన పోస్టుకి ఇచ్చిన రిప్లైని కూడా డిలీట్ చేశాడు...

2021లో సీఎస్‌కేలోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజాని విష్ చేస్తూ ట్వీట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. దానికి సమాధానం ఇచ్చిన జడేజా... ‘మరో 10 ఏళ్లు సీఎస్‌కేలోనే ఉంటా...’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్‌ని కూడా డిలీట్ చేశాడు జడేజా...
 

సీఎస్‌కే సంబంధించిన ట్వీట్లు, కామెంట్లు కూడా డిలీట్ చేస్తుండడంతో మనోడు ఇకపై చెన్నైకి ఆడడం కష్టమే అంటున్నారు అభిమానులు. 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కీ, డేవిడ్ వార్నర్‌కీ చెడినట్టే... 2022 సీజన్ వల్ల రవీంద్ర జడేజాకీ, సీఎస్‌కేకీ చెడిందని కామెంట్లు చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.. 

click me!